మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం

భారత్‌ ‌తిరిగి విశ్వగురు స్థానాన్ని చేరుకుంటోంది..
జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
దేశ ప్రజలకు రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 25 :  భారతీయులుగా మనందరికీ ఏకైక ఉమ్మడి గుర్తింపు అంటే మన రాజ్యాంగమే అని.. ఇది దేశ ప్రజలందరినీ ఒకే కుటుంబంగా కలుపుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు.. దేశ పౌరులకు రిపబ్లిక్‌ ‌డే శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌ ‌కు స్వేచ్ఛా స్వాతంత్య్రం వొచ్చిన తర్వాత.. మూడేళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత 1949లో నవంబర్‌ 26‌న రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిందని గుర్తు చేశారు. ఆ రోజుకు చరిత్రలో ప్రత్యేక చరిత్ర ఉందన్న రాష్ట్రపతి నవంబర్‌ 26 ‌ను సంవిధాన్‌ ‌దివస్‌ అం‌టే రాజ్యాంగ దినోత్సవంగా 2015 నుంచి జరుపుకుంటున్న విషయాన్ని తెలిపారు.  75 ఏళ్ల గణతంత్ర దినోత్సవం పౌరులందరూ గర్వించదగ్గ రోజని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

చాలా మంది దేశానికి 75 ఏళ్లు రెప్పపాటు సమయం అంటారు. కానీ.. ఈ 75 ఏళ్లు భారత్‌ ‌కు అలా కాదు అన్నారు. భారత్‌ ‌లో చాలా కాలంగా నిద్రాణమైన ఆత్మ మళ్లీ మేల్కొందని ప్రశంసించిన రాష్ట్రపతి.. అంతర్జాతీయంగా భారత్‌ ‌ప్రత్యేక, సముచిత స్థానాన్ని తిరిగి పొందేందుకు అడుగులు వేస్తోందని ప్రకటించారు. పురాతన నాగరికతలలో భారత్‌ ఒకప్పుడు జ్ఞానానికి కేంద్రంగా విరాజిల్లిందన్నారు. అలాంటి జ్ఞాన భూమిలో చీకటి అధ్యయనం కొన్నాళ్లు వచ్చింది.. దాంతో దేశం తీవ్రమైన దోపిడికి గురైందని వ్యాఖ్యానించారు. బ్రిటీషర్ల దోపిడీ కారణంగానే.. దేశంలో పేదరికం నెలకొందన్నారు. కానీ.. ఇప్పుడు అభివృద్ధి పథంలో భారత్‌ ‌దూసుకుపోతుందని, అంతర్జాతీయంగా అత్యున్నత స్థానంలో నిలిచే క్రమంలో ఉందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *