హన్మకొండ, ప్రజాతంత్ర : హన్మకొండ (Hanmakonda)బాలసముద్రంలోని ఏకశిలా పార్కులో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్‌డీఎఫ్) రూ.5 లక్షల నిధులతో పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేశారు. పార్క్ కు తూర్పు వైపున ఐరన్ గేట్, యోగా షెడ్, జిమ్‌లో కంకర, పిల్లల ఆట స్థలంలో ఇసుక, ఆర్చ్ వద్ద ఎర్రమట్టి పోసి మొక్కలు నాటడం వివిధ అభివృద్ధి పనులు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వంగ రాజి రెడ్డి మాట్లాడుతూ.. అసోసియేషన్ కృషి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సహకారంతో ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ పచ్చిమట్ల ఎల్ల గౌడ్, అసోసియేషన్ గౌరవాధ్యక్షులు చాడ దశరథ రామ్ రెడ్డి, సెక్రటరీ పడాల సోమయ్య సభ్యులు చెన్నం రవీందర్ రెడ్డి, మొసలి సురేష్ రెడ్డి, కమలాకర్, కాంట్రాక్టర్ పబ్బా చంద్రమోహన్ పాల్గొన్నారు.





