– ‘ఎక్స్’లో సీఎం రేవంత్ పోస్టు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : గుర్రంగూడలో గురువారం ప్రారంభించే వనమహోత్సవానికి ఒక ప్రాధాన్యత ఉంది.. ఇది కేవలం మొక్కుబడి కార్యక్రమం కాదు.. ‘మొక్క’వోని పట్టుదలతో నిన్నటి విధ్వంస సంఘటనల జ్ఞాపకాల నుండి తీసుకున్న సంకల్పానికి ఫలితం అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ‘ఎక్స’లో పోస్టు చేశారు. చెరువుల కబ్జా, అటవీ భూములపై పంజా.. ఫలితంగా చినుకు పడితే హైదరాబాద్ అతలాకుతలం.. ఇదీ గత పాలనా దృశ్యం.. చెరువుల పరిరక్షణ, నాలాల పునరుద్ధరణ, అటవీ భూములపై న్యాయస్థానాల్లో కొట్లాడి విజయం సాధించి, పర్యావరణహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే యజ్ఞం.. ఇది నేటి పాలన దృశ్యం. 2021లో ఇదే గుర్రంగూడలో వరదల సమయంలో మల్కాజ్‌గిరి ఎంపీగా పర్యటించినప్పుడు నా మదిలో కలిగిన ఆవేదన నుండి పుట్టిన ఆలోచనకు ఆచరణ ఈనాటి గుర్రంగూడ అటవీ భూమిలో జరిగే వనమహోత్సవం. ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన అనంతరం కబ్జాదారులపై న్యాయ పోరాటం చేసి అటవీ భూములను రక్షించి, నగరాన్ని వనంలో జనం జీవించే ప్రాంతంగా తీర్చిదిద్దే మా ప్రయత్నానికి ఈరోజు నిర్వహించే గుర్రంగూడ వనమహోత్సవం ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





