23న ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ (ట్రైనీ) పోస్టులకు జాబ్‌మేళా

– 10 పోస్టుల భర్తీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఫోర్స్ 9 ఎగ్జిక్యూటివ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో  ఈ నెల 23న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఫోర్స్ 9 సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లోని 10 ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ (ట్రైనీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ చేసిన యువకుల” 26 నుండి 32 సంవత్సరాల వయసు వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ చీఫ్(యూఈఐ అండ్ జీబీ/ఎంసీసీ) ఒక ప్రకటనలో తెలియజేసింది. రూ.35,000/- వరకు నెల వేతనం ఉండే ఈ  ఉద్యోగాలకు మరిన్ని వివరాలకు. హెచ్‌ఆర్ ఎ.వర్మ 9247526978ను సంప్రదించాలని కోరారు. విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్‌తో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో వద్ద నేరుగా 23న హాజరు కావాలన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *