హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(‘సర్’) అంశంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ అధికారులతో తెలంగాణ మీడియా అకాడమీ జర్నలిస్టుల కోసం ప్రత్యేక అవగాహన పరస్పర చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నెల 22వ తేదీ ఉదయం 11 గంటలకు మీడియా అకాడమీ ఆడిటోరియం, చాపెల్ రోడ్, నాంపల్లి, హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నది. ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ అధికారులు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, దాని లక్ష్యాలు, అమలు విధానం, ప్రజల భాగస్వామ్యం, ఓటరు నమోదు, సవరణలు తదితర అంశాలపై సమగ్రంగా వివరిస్తారు. జర్నలిస్టులు తమ సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకునే అవకాశం కల్పించనున్నది. పాల్గొనదలచిన జర్నలిస్టులు 20వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట లోపు వాట్సాప్ నంబర్ 7093600977కు తమ పేర్లను పంపి నమోదు చేసుకోవలసిందిగా అకాడమీ కోరింది. నిర్వహణ సౌలభ్యం దృష్ట్యా గడువు లోపు పేర్లు నమోదు చేసుకున్న జర్నలిస్టులకు మాత్రమే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలుగుతుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





