ప్రజా ప్రయోజనాలకే ప్రభుత్వ భూములు వినియోగించాలి

– కేపీహెచ్ బీ స్థలాల వేలాన్ని నిలిపివేయాలి
– ఎంపీ ఈటల డిమాండ్

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 24: కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్ బీ) పరిధిలోని ప్రభుత్వ స్థలాల వేలాన్ని ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ డిమాం డ్ చేశారు. కేపీహెచ్ బీలోని రమ్య గ్రౌండ్స్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల వేలం నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వాలు ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు విక్రయించినా లేదా లీజుకు ఇచ్చినా స్థానిక ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించడం, పేద, మధ్యతరగతి వర్గాలకు అందుబాటు ధరల్లో గృహాలు నిర్మించి ఇవ్వడం వంటి ప్రజా ప్రయోజన నిబంధనలు అమలు చేసేవారని గుర్తు చేశారు. అటువంటి ప్రయోజనాలను పక్కనపెట్టి, కేవలం ప్రస్తుత ఆర్థిక అవసరాల కోసమే విలువైన ప్రభుత్వ భూములను విక్రయించడం సరైన విధానం కాదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక ప్రజల అవసరాలు, భవిష్యత్ తరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కేపీహెచ్ బీ స్థలాల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను ప్రజల ఆస్తిగా భావించి, ప్రజా ఉపయోగక రమైన ప్రాజెక్టుల కోసం అభివృద్ధి చేయాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *