– దివ్యాంగ వధువులకు సాయం కొనసాగించాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి స్వల్ప ఊరట లభించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్షి, షాదీ ముబారక్ పథకాల కింద దివ్యాంగ వధువులకు అందిస్తున్న అదనపు సాయాన్ని కొనసాగించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వీరికి ఈ పథకాల వర్తింపుపై విధించిన స్టేను హైకోర్టు సోమవారం ఎత్తివేసింది. దివ్యాంగు లకు మినహా మిగిలిన వారికి ఈ రెండు పథకాలపై విధించిన స్టే కొనసా గుతోందని స్పష్టం చేసింది. అయితే దీనిపై వాదనలు వినిపించడానికి రా ష్ట ప్రభుత్వం రెండు వారాల గడువు కోరింది. ఈ పథకాల కింద సాధా రణ లబ్దిదారులతో పోలిస్తే దివ్యాంగ వధువులకు 25 శాతం అదనంగా ఆర్థిక సాయం అందించేలా గతంలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. సోమవారం ఈ పథకాల అమలుపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. దివ్యాంగుల హక్కుల చట్టం నిబంధనలకు అనుగుణంగానే ఈ ప్రత్యేక ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనానికి స్పష్టం చేశారు. ప్రభుత్వ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. దీంతో దివ్యాంగ వధువులకు ఈ పథకాల కొనసాగింపునకు ఆదేశించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




