ప్ర‌భుత్వం ప‌నిచేస్తున్న‌ది పేద‌ల కోస‌మే

– జీవ‌నోపాధికి చిహ్నం ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం
– మంత్రి దనసరి అనసూయ సీత‌క్క‌

వెంకటాపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: పేదల కలల్ని సాకారం చేసేందుకు త‌మ‌ ప్రభుత్వం కృషి చేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు బయ్యా ప్రమీల ఇందిరమ్మ ఇంటిని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణిలతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల జీవనోపాధికి చిహ్నంగా నిలిచిందని అన్నారు.పేదల బాగోగుల పట్ల శ్రద్ధచూపడం అందులో భాగమని పేర్కొన్నారు. త‌మ ప్రభుత్వమే నిజమైన రైతు–కూలీలకు అండగా నిలుస్తోందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ జోడెద్దుల్లా సమపాళ్లలో ముందుకు వెళ్తున్నాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం కమిషన్‌ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. పేదల గౌరవప్రదమైన జీవనానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page