– ఐకెపి సిబ్బందికి ఎమ్మెల్యే కడియం హెచ్చరిక
=జనగామ,ప్రజాతంత్ర,అక్టోబర్16 : రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే రైతులను.. కేంద్ర నిర్వాహకులు ఇబ్బంది పెడితే సహించేది లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి హెచ్చరించారు. ధాన్యం కొనుగోలులో వారికి సహాయంగా ఉండి తగిన విధంగా చేయూత ఇవ్వాలన్నారు. నమిలిగొండలో గురువారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కడియం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్య ఉన్నా రైతులు తన దృష్టికి తీసుకురావాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం- రైతు ప్రభుత్వమని దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఈ ఏడాది నుంచి ధాన్యం డబ్బులతో పాటు బోనస్ కూడా అందించడానికి ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయం తీసుకుందని కొనియాడారు. ధాన్యం కొనుగోలు ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. రైతులకు మద్దతు ధరలు ఇవ్వడం, పూర్తి ధాన్యం కొనడం ప్రభుత్వ బాధ్యతని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





