బర్డ్‌ఫ్లూపై సర్కారు అలర్ట్..‌ పలు సూచనలు

  • చికెన్‌ ‌తక్కువగా తినాలి …
  • కోళ్ల ఫారాలను శానిటైజ్‌ ‌చేయాలని ఆదేశాలు..
  • ఆంధ్రప్రదేశ్‌ ‌నుంచి వొచ్చే వాహనాల తనిఖీలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి12 : ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో కోళ్లకు బర్డ్ ‌ఫ్లూ వ్యాధి సోకి మరణిస్తుందడంతో తెలంగాణ అధికారులు అలెర్ట్ అయ్యారు. తెలంగాణ ప్రజలు చికెన్‌ ‌తక్కువగా తినాలని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే తెలంగాణలో బర్డ్ ‌ఫ్లూ లేదని, ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు సైతం చెబుతున్నారు. అయినప్పటికీ పలు జాగ్రత్తలు తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆంధ్ర నుంచి తెలంగాణకు వొచ్చే సరిహద్దుల్లో తనిఖీలు పెంచింది. కోదాడ మండలం రామాపురం చెక్‌ ‌పోస్ట్ ‌వద్ద వాహనాల తనిఖీ కొనసాగుతోంది.

ఈ నెల 7 నుంచి రాష్ట్ర బార్డర్‌ ‌చెక్‌ ‌పోస్టుల వద్ద నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి బర్డ్ ‌ఫ్లూ లేకపోయినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యాధి వ్యాప్తించకుండా చర్యలు తీసుకుంటున్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులు కోళ్ల ఫారాలను సందర్శించి రైతులకు సూచనలు చేస్తున్నారు.  దాణా తెచ్చే వాహనాలు సైతం శానిట్కెజ్‌ ‌చేసి కోళ్ల ఫారాలకు అనుమతించాలని, శానిట్కెజ్‌ ‌చేయకుంటే ఇబ్బంది వస్తుందని అంటున్నారు.ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు బర్డ్ ‌ఫ్లూ కేసులు నమోదు కాలేదని పశుసంవర్ధక శాఖ డ్కెరెక్టర్‌ ‌గోపి వెల్లడిరచారు.

ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం ఇతర కారణాలతో కోళ్లు మరణించినట్టు ఆయన పేర్కొన్నారు. చికెన్‌ ‌తినొచ్చా? అధికారులు చెబుతుందిదే తెలంగాణ రాష్ట్రంలో చికెన్‌ ‌తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు. సోషల్‌ ‌మీడియాలో చికెన్‌ ‌తినకూడదని తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఆ ప్రచారాన్ని నమ్మవొద్దని వెల్లడించారు. వరంగల్‌, ‌ఖమ్మం జిల్లాలో కోళ్ల మృతిపై రక్త నమూనాలను ల్యాబ్‌ ‌కు పంపించామని, అవి ఇతర కారణాలతో మృతి చెందినట్లు తేలిందని ఆయన అన్నారు బర్డ్ ‌ఫ్లూ పై పౌల్ట్రీ రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని వెల్లడిరచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *