కొత్త ఏడాది మొదటి రోజే ధరల పరుగులు

– స్వల్పంగా పెరిగిన బంగారం.. తగ్గిన వెండి రేట్లు

హైదరాబాద, ప్రజాతంత్ర, జనవరి 1: కొత్త సంవత్సరం తొలి రోజునే బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. మూడు రోజుల బేరిష్‌ ట్రెండ్‌కు బ్రేకులు చెబుతూ గురువారం పసిడి ధర స్వల్పంగా పెరిగింది. గుడ్‌ రిటర్న్స్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. గురువారం ఉదయం 11 గంటల సమయంలో 24 క్యారెట్‌ 10 గ్రాముల పసిడి ధర నిన్నటితో పోలిస్తే స్వల్పంగా పెరిగి రూ.1,35,060కు చేరుకుంది. ఇక 22 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర కూడా సుమారు రూ.150 మేర పెరిగి రూ.1,23,800కు చేరుకుంది. వెండి ధర మాత్రం మరింతగా తగ్గింది. కిలో వెండి రేటు నిన్నటితో పోలిస్తే సుమారు రూ.1000 మేర తగ్గి రూ.2,38,000కు చేరుకుంది. సుంకాల ప్రభావం, ఫెడ్‌ వడ్డీ రేటు కోతపై పెరుగుతున్న అంచనాలు, కేంద్ర బ్యాంకుల పసిడి కొనుగోళ్లు వంటివి బంగారానికి మళ్లీ డిమాండ్‌ పెంచుతున్నాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అయితే నేడు ట్రేడిరగ్‌ ఓ మోస్తరుగా ఉండటంతో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కూడా ఆ మేరకు పరిమితమయ్యాయంటున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page