మళ్లీ స్పల్పంగా పెరిగిన బంగారం ధర

హైదరాబాద్‌, అక్టోబర్‌ 25: ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ స్థాయిల నుంచి క్రమంగా దిగి వస్తున్న బంగారం ధర శనివారం ట్రేడిరగ్‌లో స్వల్పంగా పెరిగింది. దీపావళి తర్వాత బంగారం ధర భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్‌ ధర తగ్గడంతో దేశీయంగా కూడా పసిడి ధరలు క్రమంగా దిగివచ్చాయి. అయితే శనివారం ట్రేడిరగ్‌లో మాత్రం స్వల్ప పెరుగులను నమోదు చేసింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,25,620కి చేరింది. నిన్నటితో పోల్చుకుంటే రూ.125 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.1,15,150కి చేరింది. నిన్నటితో పోల్చుకుంటే రూ.115ల మేర పెరుగుదల నమోదు చేసింది. ఇక దేశ రాజధాని ఢల్లీిలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.1,25,770కి చేరుకోగా 22 క్యారెట్ల గోల్డ్‌ ధర 10 గ్రాములకు రూ.1,15,300కి చేరుకుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page