యూపీ మిర్జాపూర్‌ స్టేషన్‌లో ఘోర ప్రమాదం

– ట్రాక్‌పై దిగిన యాత్రికులను ఢీకొన్న రైలు
– ఆరుగురు దుర్మరణం

లక్నో, నవంబర్‌ 5: ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మిర్జాపుర్‌లో బుధవారం ఉదయం పట్టాలు దాటుతున్న యాత్రికులను ఓ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. కార్తీక‌ పౌర్ణమి నేపథ్యంలో మహిళా యాత్రికులు గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి చోపాన్‌ ప్రాంతం నుంచి వారణాసికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. యాత్రికులు చోపాన్‌-ప్రయాగ్‌రాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో చునార్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. రైలు నుండి ప్లాట్‌ఫాంపై దిగకుండా మరోవైపు ఉన్న ప్లాట్‌ఫాం వైపు పట్టాలపై దిగారు. ఈ క్రమంలో స్టేషన్‌ సమీపిస్తున్న హౌరా`కల్కా నేతాజీ ఎక్స్‌ప్రెస్‌ రైలు వీరిని  ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత ఉదయం 10 గంటలకు ట్రాక్‌ క్లియర్‌ చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page