సెర్ప్ అడిషనల్ సీఈవోకు మంత్రి సీతక్క అదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28: కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేసే లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని సెర్ప్ అడిషనల్ సీఈఓ పి.కాత్యాయనిదేవికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. ఇటీవలే సెర్ప్ అడిషనల్ సీఈఓగా నియమితులైన కాత్యాయని దేవి సచివాలయంలో మంత్రి డాక్టర్ సీతక్కతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెని మంత్రి అభినందించారు. స్థానికంగా లభించే వస్తువులు, ఉత్పత్తులతో మహిళా సంఘాలచే పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతి జిల్లా నుంచి విజయవంతంగా నడుస్తున్న మహిళా స్వయం సహాయక బృందాలను గుర్తించి మొదటి విడతలో వారిచే పరిశ్రమలు ఏర్పాటు చేయించాలన్నారు.