.ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
పరిగి, ప్రజాతంత్ర, జూన్ 21: ఈసారి మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు కల్పించాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ను శనివారం కలిశారు. ఈ సందర్భంగా వినతిపత్రం అందచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుండి జరిగిన మూడు శాసనసభ ఎన్నికలలో రెండుసార్లు గెలిచి సీఎల్పీ సెక్రటరీ పనిచేశానని, అదేవిధంగా రెండు పర్యాయాలుగా జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ పార్టీ పటిష్టతకు పనిచేసి జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే స్థానాల గెలుపునకు కృషి చేశానని ఖర్గే కి తెలియచేశారు.2017 నుండి లో తెలంగాణ రాష్ట్ర శక్తి కన్వీనర్ గా రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు పనిచేశానని, 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ మారకుండా ఉన్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగానని తెలిపారు. రాష్ట్రంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించి తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఏఐసిసి అధ్యక్షుడిని కోరినట్టు ఎమ్మెల్యే తెలిపారు.