ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కండి

– కార్యకర్తలకు మంత్రి దామోదర్ సూచన

సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధం కావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాయకుల్లో వర్గపోరు ఉంటే పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తా పదవిని అనుభవించాలన్నారు. వొచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన ఉన్నా లేకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బలమని, కార్యకర్తలే ధైర్యం, స్థైర్యమని స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో సిద్దాంతాలు, విశ్వాసం తక్కువని, అవకాశవాదం ఎక్కువని అన్నారు. ఎప్పుడూ శత్రువుని తక్కువ అంచనా వేయకూడదని సూచించారు. 70 వేల ఉద్యోగాలను ప్రభుత్వం ఇప్పటికే భర్తీ చేసిందని వెల్లడించారు. ఆరోగ్య శాఖలో మరో మూడు నెలల్లో మొత్తం 20 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇస్తున్న సన్న బియ్యం పథకం దేశంలో ఎక్కడా లేదని దామోదర్ చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. రూ.200 కోట్ల అభివృద్ధి పనులతో సింగూరు ప్రాజెక్టును టూరిజం స్పాట్‌గా మారుస్తామని మంత్రి దామోదర్ తెలిపారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, నీలం మధు, కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *