రీల్స్ మోజులో బాలుడు

– బిల్డింగ్‌పై నుంచి పడి తీవ్ర గాయాలు
– చికిత్స పొందుతూ మృతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : గంటలతరబడి రీల్స్ స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేసేవారు కొందరైతే.. రీల్స్ కోసం రిస్క్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు మరికొందరు. రీల్స్ కోసం రిస్క్ చేసి మరో బాలుడు ప్రాణాలు వదిలిన సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ బిల్డింగ్‌పై నుంచి జారిపడి బాలుడు మృతిచెందాడు. ఈనెల 5న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ గాంధీ బొమ్మ బస్తీకి చెందిన 14 ఏళ్ళ బాలుడు మితున్ రీల్స్ చేస్తూ బిల్డింగ్ పైనుంచి పడిపోయాడు. ఈనెల 5న జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మిథున్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మృతిచెందాడు. మితున్ బిల్డింగ్ మీద నుంచి కిందపడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాలుడి మృతదేహాన్ని అతని బంధువులు బీహార్‌కు తరలిస్తున్నారు. మితున్ మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *