మక్క రైతుల ఖాతాల్లో త్వరలో నిధుల జమ

– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : మొక్కజొన్న రైతుల ఖాతాల్లో త్వరలో నిధులు జమ కానున్నాయి. లక్ష మంది రైతుల ఖాతాల్లో రెండు మూడు రోజుల్లో రూ.1173 కోట్లు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.  మొక్కజొన్న సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు నెలకొల్పిందన్నారు. ఇప్పటికే 14 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరణ జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో గోడౌన్‌లతోపాటు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా పొరుగు రాష్ట్రాల్లోని గోదాములకT కూడా మొక్కజొన్న తరలిస్తున్నామన్నారు. కాగా, ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరిగే కోహెడ మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి తుమ్మల సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కార్యక్రమ ఏర్పాట్ల కోసం వివిధ శాఖల హెచ్‌వోడీలు, రాష్ట్రస్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమం విజయవంతం అయ్యేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వేదిక, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పార్కింగ్, భద్రత, విద్యుత్, పారిశుధ్యం తదితర అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *