హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : తన స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా సుపరిపాలన, ప్రజా సేవల మెరుగుదల లక్ష్యంగా సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఒక వారపు ఉచిత ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని సివిల్ సర్వీసెస్, గ్రూప్-1 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. జూన్ 2వ తేదీ నుండి ఈ ఓరియంటేషన్ ప్రారంభమవుతుంది. ప్రతిరోజూ మూడు గంటలపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, నిపుణులు, సీనియర్ అధికారులు మార్గదర్శకత్వం చేస్తారు. కార్యక్రమంలో ప్రధానంగా పరీక్షా వ్యూహాలు, ప్రణాళిక, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్, నైతిక విలువలు నాయకత్వ లక్షణాలు, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, కెరీర్ మార్గదర్శకత్వం చేస్తారు. అయితే బోర్డింగ్, లాడ్జింగ్ సదుపాయాలు కల్పించరు. ఆసక్తి గల అభ్యర్థులు తమ సీవీ/బయోడేటాను ctsmcrhrdit24@gmail.com కు పంపి నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో ప్రజా సేవా స్పూర్తిని పెంపొందించి, రాష్ట్రం, దేశానికి సమర్థులు, నిబద్ధత కలిగిన ప్రజా సేవకులను తయారు చేయాలనే సంస్థ సంకల్పాన్ని ప్రతిబింబిస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




