ఉద్యోగార్థులకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్

– ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12 : రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ అందించేందుకు పొంగులేటి శీనన్న యువనేస్తం కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పీఎసఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్‌సీ ఎగ్జామ్స్ భాగస్వామ్యంతో ఉచిత ఆన్‌లైన్ కోచింగ్‌ను అందించనున్నారు. ష్ట్రttజూs://జూsతీyuఙaఅవstష్ట్రaఎ.ఱఅ/ పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగ ఆశావాహులకు ఏడాదిపాటు రూ.40 వేల విలువైన కోచింగ్‌ను ఆన్‌లైన్‌లో ఉచితంగా అందిస్తారు. గ్రూప్-1, 2, 3, 4, ఎస్సై, కానిస్టేబుల్, పంచాయతీరాజ్, ఫారెస్ట్, రైల్వే, బ్యాంకింగ్, డీఎస్సీ వంటి వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా అన్ని సబ్జెక్టుల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శిక్షణ అందించనున్నారు. ఉద్యోగం సాధించాలనే యువత ఆకాంక్షలకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదనే గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *