– రైతు డిస్కమ్ ను వ్యతిరేకిస్తున్నాం
– జీవోను తక్షణం ఉపసంహరించుకోవాలి
-రైతన్నకు ఉరి వేసేందుకు కాంగ్రెస్ కుట్ర ఇది
– బీఆర్ఎస్ దీన్ని సహించదు
– బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావుహైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సహా ఇతర రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, విద్యుత్ రంగ నిపుణులు, సామాజికవేత్తలు, రైతులు లేవనెత్తుతున్న అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ రైతు డిస్కమ్ ఏర్పాటు చేస్తూ జీవో17 జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి బిఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు డిస్కమ్ ఏర్పాటు జీవో జారీ కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, దుర్మార్గ వైఖరికి నిదర్శనమన్నారు. ఉచిత విద్యుత్ సరఫరాకు పాతరేసి, రైతు మెడకు ఊరేసేందుకేనా ఈ కుట్ర? వ్యవసాయానికి, గృహాలకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు రైతు డిస్కమ్ పేరుతో మరో డ్రామాకు తెరతీయడం సిగ్గుచేటు. రైతు డిస్కమ్ ఏర్పాటు వల్ల రైతులకు ఒరిగే ప్రయోజనం ఏమిటి? రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఈ నిర్ణయం ఎలా దోహదపడుతుందో చెప్పకుండా మొండిగా వ్యవహరించడం దుర్మార్గం.సర్కార్ నిర్వాకంతో అన్నదాత మరింత ఇబ్బందుల్లో కూరుకుపోతాడన్నారు. ఇప్పటికే ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతే దిక్కు లేదు..రేపు రైతు డిస్కం తో మరింత ఇబ్బందులు తలెత్తే పరిస్థితి. రైతు మెడకు రైతు డిస్కం ఉచ్చు..ఉచిత విద్యుత్ పై చేతులెత్తేసేందుకే సర్కార్ కొత్త ఎత్తుగడ అని విమర్శించారు. పంటలు ఎండి రైతు కన్నీరు పెడుతుంటే.. డిస్కంల పేరిట రేవంత్ సర్కార్ రాజకీయ చదరంగం ఆడుతున్నది. జీవో ప్రకారం కొత్త డిస్కమ్ పరిధిలోకి 30,60,861 వ్యవసాయ కనెక్షన్లు, 512 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు,హెచ్డబ్ల్యుఎస్ఎస్బి, మిషన్ భగీరథ.. మొత్తంగా 30,62,853 కనెక్షన్లు రైతు డిస్కం కి బదిలీ చేసారు. ఇంత భారీ వ్యవస్థ నిర్వహణ కేవలం 2,000 మంది సిబ్బందితో ఎలా సాధ్యం అవుతుంది? కేవలం 25శాతం థర్మల్ పవర్ అలకేషన్ తో రైతులకు సాగు, ప్రజలకు తాగు నీళ్లకు అవసరం అయ్యే భారీ విద్యుత్ వ్యవస్థ ఎలా నడుస్తుంది? 6,15,651 వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు, 2.51 లక్షల సర్క్యూట్ కిలోమీటర్ల వ్యవసాయ ఎల్టీ లైన్లు.. వీటి నిర్వహణకు సరిపడా సిబ్బంది లేకపోతే రైతుల కష్టాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? రాష్ట్ర విద్యుత్ కేటాయింపుల్లో ఇప్పటికీ 53.28 శాతం థర్మల్ విద్యుత్తే ఉంది. సౌర విద్యుత్తు వాటా 35.31 శాతం మాత్రమే. ఇందులో థర్మల్ 25%, సోలార్ 58%, హైడల్ మొత్తంగా 100% రైతు డిస్కమ్ కు కేటాయించారు.పగటి పూట మాత్రమే సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయితే, రాత్రి పూట ఉండదు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పే ప్రభుత్వం.. పగటిపూట మాత్రమే విద్యుత్ ఇచ్చి, రాత్రివేళ రైతులను చీకట్లోకి నెట్టబోతోందా? 2325 మెగావాట్ల హైడల్ (జల విద్యుత్) పవర్ మొత్తం రైతు డిస్కమ్కే కేటాయించారు. కానీ ఈ హైడల్ పవర్ సాంకేతికంగా ఏడాదిలో కేవలం 3-4 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే మిగతా 8 నెలలు రైతు డిస్కమ్కి ఈ విద్యుత్ అందుబాటులో ఉండదు. అప్పుడు ఎలా నిర్వహిస్తారు?కొత్త డిస్కమ్కు భారీ రుణాలు, బకాయిలను కేటాయిస్తూ.. దాని ఆర్థిక స్థిరత్వంపై ప్రభుత్వం ఏం భరోసా ఇస్తోంది? ఈ అప్పుల భారం చివరకు రైతులపై పడేయాలని చూస్తున్నారా? రైతు డిస్కమ్ పేరుతో వ్యవసాయ విద్యుత్ బాధ్యతలను వేరుచేసి, రేపు నష్టాల సాకుతో రైతులపై ఆంక్షలు విధించే ప్రమాదం లేదా?రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని, 24 గంటల సరఫరాలో ఎలాంటి కోతలు ఉండవని ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వగలదా? రైతుల అనుమానాలను నివృత్తి చేయకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్లడం కుదరదని హెచ్చరించారు. సంస్థ ఏర్పాటుతో అదనపు పరిపాలనా ఖర్చులు ఎంత? ఆ ఖర్చులను ఎవరు భరిస్తారు? ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల బదిలీపై పూర్తి వివరాలను ప్రభుత్వం బహిర్గతం ఎందుకు చేయలేదు?రైతుల పేరుతో డిస్కమ్ ఏర్పాటు చేయడం గొప్ప కాదు.. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడం ముఖ్యం. సంస్థల పేర్లు మార్చడం, కొత్త సంస్థలు ఏర్పాటు చేయడం కాదు.. రైతుల విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు.

—————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు