మ‌రో న‌లుగురు నేపాలీ గ్యాంగ్ స‌భ్యుల‌ అరెస్ట్‌

– మల్కాజిగిరి చోరీ కేసులో..

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మల్కాజిగిరి చోరీ కేసులో నేపాలీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో మల్కాజిగిరి పరిధిలోని రిటైర్డ్ ప్రొఫెసర్ నివాసంలో నేపాలీ ముఠా భారీ చోరీకి తెగబడింది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు కీలక సూత్రధారులను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా మరో నలుగురిని పుణెలో అరెస్టు చేశారు. మొత్తం ఆరుగురు సభ్యులు పోలీసు కస్టడీలో ఉన్నారు. వీరిని పుణె నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు మల్కాజిగిరి పోలీసులు తెలిపారు. రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో రాత్రి సమయంలో చొరబడిన నేపాలీ గ్యాంగ్ రూ.లక్షల విలువైన నగలు, నగదు, ఇతర వస్తువులను అపహరించింది. మల్కాజిగిరి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లు, సెల్‌ఫోన్ లొకేషన్ డేటా ఆధారంగా గ్యాంగ్‌ను ట్రాక్ చేశారు. నేపాలీ ముఠా దేశంలోని వివిధ నగరాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *