మూడు హామ్ రోడ్లకు శంకుస్థాపన

కొల్లాపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో పెద్దకొత్తపల్లి మండలంలోని నక్కల బండ స్టేజ్ వద్ద రూ.15.87 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మూడు హ్యామ్ రోడ్డు పనులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ అనసూయ(సీతక్క), పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్‌లతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. పెద్దకొత్తపల్లి మండలం బండారపాకుల వద్ద పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి జెడ్పీ రోడ్డు వరకు నక్కలపల్లి, వెంకటచెర్ల మీదుగా 6.95 కి.మీ మేర రహదారి నిర్మాణాన్ని రూ.569.90 లక్షల అంచనా వ్యయంతో, పెద్దకొత్తపల్లి మండలంలో బండపల్లి మీదుగా పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి జమ్మనాపూర్ వరకు 4.40 కి.మీ రహదారి నిర్మాణానికి రూ.360.80 లక్షలు కేటాయించారు. వీపనగండ్ల మండలంలో కొర్లకుంట ఎక్స్ రోడ్డు నుంచి తూముకుంట-బొల్లారం ఎక్స్ రోడ్డు వరకు 8 కి.మీ మేర రహదారి పనులను రూ.656 లక్షలతో చేపట్టనున్నారు. మూడు రహదారుల మొత్తం పొడవు 19.35 కి.మీ కాగా మొత్తం అంచనా వ్యయం రూ.1,586.70 లక్షలతో రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అదనపు కలెక్టర్ దేవసహాయం, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *