గురువే ప్రత్యక్ష దైవం

–  ఉపాధ్యాయులకు రామచందర్‌రావు గురుపూజోత్సవ శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : ‘గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః.. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః’.. మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రల తర్వాత దైవ సమానులుగా పూజించేది గురువులనే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఒక ప్రకటనలో అన్నారు. ఆచార్య దేవోభవ అంటూ గురువును ప్రత్యక్ష దైవంగా భావించి గౌరవించడం మన సనాతన సంప్రదాయమన్నారు. అలాంటి మహోన్నతమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ భావితరాలను తీర్చిదిద్దుతున్న రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పెద్దలందరికీ హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ(గురుపూజోత్సవం) శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటున్న ఈ పవిత్రమైన రోజున గురువుల సేవలను మనస్ఫూర్తిగా స్మరించుకోవడం మనందరి కర్తవ్యమని అన్నారు. అజ్ఞానమనే చీకట్లను తొలగించి జ్ఞాన జ్యోతులను వెలిగిస్తూ పిల్లల్లో సత్ప్రవర్తన, నైతిక విలువలు, దేశభక్తిని నూరిపోసి ఉత్తమ పౌరులుగా మలుస్తున్న గురువుల రుణం తీర్చుకోలేనిదని తెలిపారు. సమాజ హితమే శ్వాసగా విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయినీఉపాధ్యాయులందరూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *