“1969 తెలంగాణ ఉద్యమం వెనుక కుట్రలు ఎన్ని జరిగినా 369 మంది అసువులు బాసినా ఆకాంక్ష నెరవేరలేదు.రావణకాష్టంలా రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను తెలుపుతూ నాడు ఉద్యమకారుల నిరసన పోరాటంలో భాగంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నత విద్యా అవకాశాలను విస్త రించాలన్న డిమాండ్ తో నాటి ప్రధాని ఇందిరగాంధిని 1973లో తిప్పన సిద్దులు, సంజీవ రావు,కే కేశవరావు,కుమార్ కలవడం జరిగింది. విశ్వ విద్యాలయం ఏర్పాటుకు సుముఖంగా ఉన్నా, ఎమర్జెన్సీ రావడం దీర్ఘకాల ఆకాంక్షల నేపథ్యంలో 1976 ఆగస్టు 19న కాకతీయ విశ్వవిద్యాలయం ఆవిర్భవించింది..”
‘1969 తెలంగాణ ఉద్యమం వెనుక కుట్రలు ఎన్ని జరిగినా 369 మంది అసువులు బాసినా ఆకాంక్ష నెరవేరలేదు.రావణకాష్టంలా రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను తెలుపుతూ నాడు ఉద్యమకారుల నిరసన పోరాటంలో భాగంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నత విద్యా అవకాశాలను విస్తరించాలన్న డిమాండ్ తో నాటి ప్రధాని ఇందిరగాంధిని 1973లో తిప్పన సిద్దులు, సంజీవ రావు,కే కేశవరావు,కుమార్ కలవడం జరిగింది. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సుముఖంగా ఉన్నా, ఎమర్జెన్సీ రావడం దీర్ఘకాల ఆకాంక్షల నేపథ్యంలో 1976 ఆగస్టు 19న కాకతీయ విశ్వవిద్యాలయం ఆవిర్భవించింది..”
కాకతీయుల చారిత్రక రాజధాని ఓరుగల్లు నేలపై వెలసిన కాకతీయ విశ్వవిద్యాలయం తెలంగాణ ఉన్నత విద్యా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. ఈ విశ్వవిద్యాలయం కేవలం ఒక విద్యాసంస్థ మాత్రమే కాదు, ఉద్యమాల స్ఫూర్తి, విద్యా వికాసానికి ప్రతీకఉత్తర తెలంగాణ ప్రజల ఉన్నత విద్యా ఆకాంక్షలకు ప్రతిరూపం. 2026లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయ ప్రస్థానాన్ని పరిశీలించడం అంటే తెలంగాణ సామాజిక, విద్యా, సాంస్కృతిక పరిణామాన్ని కూడా గుర్తుచేసుకోవడం ఆనవాయితీ. తెలంగాణ కు ప్రామాణికమైన వరంగల్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రారంభమైన పోస్ట్‌గ్రాడ్యుయేట్ సెంటర్ మాత్రమే ఉన్నది.
1969 తెలంగాణ ఉద్యమం వెనుక కుట్రలు ఎన్ని జరిగినా 369 మంది అసువులు బాసినా ఆకాంక్ష నెరవేరలేదు.రావణకాష్టంలా రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను తెలుపుతూ నాడు ఉద్యమకారుల నిరసన పోరాటంలో భాగంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నత విద్యా అవకాశాలను విస్తరించాలన్న డిమాండ్ తో నాటి ప్రధాని ఇందిరగాంధిని 1973లో తిప్పన సిద్దులు, సంజీవ రావు,కే కేశవరావు,కుమార్ కలవడం జరిగింది. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సుముఖంగా ఉన్నా, ఎమర్జెన్సీ రావడం దీర్ఘకాల ఆకాంక్షల నేపథ్యంలో 1976 ఆగస్టు 19న కాకతీయ విశ్వవిద్యాలయం ఆవిర్భవించింది.అప్పటి పోస్ట్‌గ్రాడ్యుయేట్ సెంటర్‌ను రాష్ట్ర విశ్వవిద్యాలయంగా ఉన్నతీకరించడం ఒక చారిత్రక నిర్ణయంగా నిలిచింది. అదే సంవత్సరం రాష్ట్ర విశ్వవిద్యాలయాల చట్టం పరిధిలోకి వచ్చింది. లెఫ్ట్,రైట్ అనే తేడా లేకుండా ఎందరో ఉద్యమకారులకు పురుడుపోసింది,రాజకీయ.అధికార ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఈ గడ్డఋణం తీర్చుకోలేనిది.
కాకతీయుల వైభవాన్ని గుర్తుచేసేలా ఈ విశ్వవిద్యాలయానికి “కాకతీయ” అనే పేరు పెట్టడం ఓరుగల్లు చరిత్రతో ఆధునిక విద్యకు అనుసంధానాన్ని ఏర్పరిచింది. విద్యాలయ ప్రాంగణానికి “విద్యారణ్యపురి” అనే పేరు కూడా ఈ ప్రాంత చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. తెలంగాణ సమాజంలో విద్యార్థి ఉద్యమాలకు చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఆ నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయ ప్రాంగణం కూడా వివిధ దశల్లో సామాజిక, రాజకీయ పరిణామాలకు స్పందించిన విద్యార్థి చైతన్యానికి వేదికగా నిలిచింది.ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష, ప్రాంతీయ అసమానతలు, ఉద్యోగాలు, విద్యా అవకాశాలు, సామాజిక న్యాయం వంటి అంశాలు విద్యార్థి చర్చల్లో ప్రముఖంగా నిలిచాయి.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉధృతమైన కాలంలో విశ్వవిద్యాలయ విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు తమ తమ పద్ధతుల్లో ఉద్యమానికి మద్దతు తెలిపారు. అయితే ఈ ఉద్యమ చరిత్రను ఒకే సంస్థకు పరిమితం చేయకుండా, తెలంగాణ సమాజంలోని విస్తృత ప్రజా-విద్యార్థి ఉద్యమాల సందర్భంలో చూడాలి.కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్రలో విద్యార్థి రాజకీయాలు, ప్రజా సమస్యలపై చర్చలు, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలపై వాదోపవాదాలు విశ్వవిద్యాలయ సంస్కృతిలో భాగమయ్యాయి. ఈ కారణంగా విశ్వవిద్యాలయం కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా సమాజంతో సంభాషించే విద్యా కేంద్రంగా ఎదిగింది.1976లో ప్రారంభమైన విశ్వవిద్యాలయం తరువాతి దశాబ్దాల్లో అనేక విద్యా విభాగాలు, అనుబంధ కళాశాలలు, పరిశోధనా కేంద్రాలు, వృత్తి విద్యా కోర్సులతో విస్తరించింది. శాశ్వత ఆచార్యుల నియామకాలు లేక తల్లడిల్లుతోంది. పరిశోధనలో ప్రమాణాలు దెబ్బతిని అల్లాడిపోతుంది. నిధుల లేమిటితో అభివృద్ధికి నోచుకోక విలవిల కొట్టుకుంటున్నది.
దూరవిద్య ద్వారా ఉన్నత విద్యను అందించేందుకు 1990లలో ఏర్పడిన దూరవిద్యా వ్యవస్థ కూడా వేలాది మంది విద్యార్థులకు అవకాశాలను అందించింది. దూరవిద్య ద్వారా 100కు పైగా ఉద్యోగులకు, వారి కుటుంబాలకు అండగా నిలిచింది.దూరవిద్య కేంద్రం, కాకతీయ విశ్వవిద్యాలయానికి బంగారు బాతుగుడ్డులా తయారయ్యింది.ఇంజినీరింగ్, ఫార్మసీ, సైన్స్, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్, కామర్స్, లా, ఎడ్యుకేషన్ వంటి విభిన్న రంగాల్లో విద్యా కార్యక్రమాలు అభివృద్ధి చెందాయి. 2009లో కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, 2012లో పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ కళాశాల ,సైకాలజీ, జర్నలిజం విభాగాల శాఖలు ఏర్పడటం, కాకతీయ విశ్వవిద్యాలయ ప్రత్యేకతల్లో పరిశోధనకు ఉన్న ప్రాధాన్యం ఒకటి. చరిత్ర, తెలుగు, రాజకీయ శాస్త్రం, సామాజిక శాస్త్రాలు, సైన్స్, టెక్నాలజీ వంటి అనేక రంగాల్లో పరిశోధనలు జరిగాయి.
ప్రాంతీయ చరిత్ర, తెలంగాణ సమాజం, ప్రజా సంస్కృతి, సామాజిక మార్పు, వెనుకబడిన వర్గాలు, దళిత చైతన్యం, గిరిజన సమాజాలు వంటి అంశాలపై కూడా పరిశోధనలు చోటుచేసుకున్నాయి. విశ్వవిద్యాలయ అధికారిక పత్రాల్లో బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా అభ్యున్నతికి కృషి చేయడం తన లక్ష్యాల్లో ఒకటిగా పేర్కొంది.ఈ ఐదు దశాబ్దాల్లో వేలాది మంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసించి దేశ, రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటారు.ఒకప్పుడు కొద్ది విభాగాలతో ప్రారంభమైన విద్యా కేంద్రం నేడు విస్తృత విద్యా, పరిశోధనా వ్యవస్థగా ఎదిగింది. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు, పూర్వ విద్యార్థులు, బోధనేతర సిబ్బంది అందరి కృషి ఈ ప్రస్థానంలో భాగస్వామ్యమైంది.అలాగే తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచిన సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ కూడా కాకతీయకు ఉపకులపతిగా పని చేయడం అదృష్టంగా భావించాలి.
1976లో ప్రారంభమైన ఈ ప్రయాణం 2026లో స్వర్ణోత్సవ దశకు చేరుకుంది. 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఒక ముగింపు కాదు, కొత్త బాధ్యతలకు ఆరంభం. రాబోయే కాలంలో కాకతీయ విశ్వవిద్యాలయం ప్రపంచస్థాయి పరిశోధన, డిజిటల్ విద్య, అంతర్జాతీయ సహకారం, ఉపాధి ఆధారిత నైపుణ్యాలు, సామాజిక శాస్త్ర పరిశోధన, ప్రాంతీయ అభివృద్ధి వంటి రంగాల్లో మరింత ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 1000 కోట్లు కేటాయించింది, సాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి 400 కోట్లు కేటాయించింది కానీ తెలంగాణకు రెండో రాజధానిగా చెప్పుకుంటున్న వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించకపోవడం వల్ల అభివృద్ధి జరగడం లేదని అపవాదుఉంది, అదే సమయంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భాష, సామాజిక ఉద్యమాలు, ప్రజల జీవన సమస్యలపై పరిశోధనలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి.
విద్యను కేవలం ఉద్యోగ సాధనంగా కాకుండా సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య చైతన్యం, మానవ విలువలను పెంపొందించే సాధనంగా చూడాలి. కాకతీయ విశ్వవిద్యాలయం పుట్టుక వెనుక ఉన్నది ఉత్తర తెలంగాణ ప్రజల ఉన్నత విద్యా ఆకాంక్ష. దాని 50 ఏళ్ల ప్రస్థానం విద్యా వికాసం, పరిశోధన, విద్యార్థి చైతన్యం, సామాజిక బాధ్యతలతో ముడిపడి ఉంది.కాకతీయుల ఓరుగల్లు చరిత్రకు ఆధునిక విద్యా వారసత్వాన్ని జోడిస్తూ నిలిచిన కాకతీయ విశ్వవిద్యాలయం తెలంగాణ విద్యా చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం.
గతాన్ని గౌరవిస్తూ, వర్తమానాన్ని విశ్లేషిస్తూ, భవిష్యత్తు తరాలకు జ్ఞానం–సామాజిక బాధ్యత–మానవీయ విలువలను అందించే విశ్వవిద్యాలయంగా ఇది మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యమిస్తున్న క్రమంలో కాకతీయ విశ్వ విద్యాలయానికి 500 కోట్లు కేటాయించి బోధన, బోధనతర సిబ్బందిని నియమించి పరిశోధన,విద్యా ప్రమాణాలను పెంపొందించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని పూర్వ విద్యార్థులు కోరుతున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంకు చెందిన భూములు కబ్జాకోరుల చేతిలో బందీ కాకుండా కఠిన చట్టాలు తేవాలి.1976 నుంచి 2026 వరకు సాగిన 50 ఏళ్ల ప్రయాణం కాకతీయ విశ్వవిద్యాలయానికి స్వర్ణోత్సవ మైలురాయి. చదువులకే కాదు , సామాజిక ,విప్లవ ఉద్యమాలకు పురుడుపోసేందుకు కాకతీయ విశ్వవిద్యాలయం కార్మాగారం అయ్యింది.
(కాకతీయ విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాల సందర్భంగా)