భార్యపై అనుమానంతో కాల్పులు

– స్థిరాస్థి వ్యాపారి అరుణ్‌ ‌కుమార్‌ ‌దురాగతం
– అక్కడిక్కడే మృతిచెందిన ఇల్లాలు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 10:  ఓ ‌స్థిరాస్తి వ్యాపారి అనుమానంతో భార్యను తుపాకీతో కాల్చి చంపాడు.ఈ  ఘటన హైదరాబాద్‌ ‌మల్కాజిగిరి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో చోటు చేసుకుంది. మారుతీనగర్‌లో నివాసం ఉంటున్న అరుణ్‌కుమార్‌ ‌రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం చేస్తున్నాడు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మాట్లాడుకుందామని చెప్పి మరో వ్యక్తితో కలిసి తెల్లవారుజామున ఇంటికి వచ్చిన అరుణ్‌ ‌భార్య నిషారాణిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. కాల్పుల శబ్దం విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని సికింద్రాబాద్‌ ‌గాంధీ హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొదటి భార్యకు విడాకులిచ్చిన అరుణ్‌ ‌కుమార్‌ ఆమె సోదరిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. మూడు నెలల క్రితం అంబర్‌పేటలో వాహన తనిఖీలు చేస్తుండగా తుపాకీతో పోలీసులకు చిక్కాడు. తుపాకీ సీజ్‌ ‌చేయడంతో పాత బస్తీకి చెందిన స్నేహితుల ద్వారా మరో తుపాకీ కొనుగోలు చేసి ఈ  దారుణానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *