రాజస్థాన్‌ ‌రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం

– రేప‌టి ప్రధాని పర్యటనపై అనుమానం

జైపూర్‌, ఏ‌ప్రిల్‌ 20: ‌రాజస్థాన్‌, ‌బలోత్రా జిల్లాలోని పచ్‌పద్ర రిఫైనరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల దుగా ఈ రిఫైనరీ ప్రారంభం కావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఇందులో అగ్నిప్రమాదం జరిగింది. గాల్లో వందల అడుగుల ఎత్తు వరకు నల్లటి పొగ కమ్ముకుంది. పెద్ద సంఖ్యలో ఫైర్‌ ఇం‌జిన్లు చేరుకున్నాయి. మంటలను ఆర్పటం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియ రాలేదు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సక్షిస్తున్నారు. పచ్‌పద్ర రిఫైనరీకి 2013 సెప్టెంబర్‌ 22‌న కాంగ్రెస్‌ ‌నాయకురాలు సోనియా గాంధీ శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో అశోక్‌ ‌గెహ్లాట్‌ ‌రాజస్థాన్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్నారు. రూ.37,230 కోట్ల వ్యయంతో రిఫైనరీ  పనులు మొదలయ్యాయి. బీజేపీ అధికారంలోకి రాగానే ప్రధాని నరేంద్ర మోదీ 2018 జనవరి 16న ప్రాజెక్ట్ ‌పనులను మరోసారి ప్రారంభించారు. హిందూస్థాన్‌ ‌పెట్రోలియం కార్పొరేషన్‌ ‌లిమిటెడ్‌, ‌రాజస్థాన్‌ ‌ప్రభుత్వం సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాయి. దేశంలో మొదటి గ్రీన్‌ఫీల్డ్ ఇం‌టిగ్రేటెడ్‌ ‌రిఫైనరీ కమ్‌ ‌పెట్రోకెమికల్‌ ‌కాంప్లెక్స్ ఇదే కావటం విశేషం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *