పోలీస్ యూనిఫామ్ లో డ్యాన్స్ చేస్తే చర్యలు 

– ప్రైవేట్ ఈవెంట్లలో ఖాకీ దుస్తుల్లో పాల్గొనడం క్రమశిక్షణా రాహిత్యమే
– పోలీసు శాఖ క్రమశిక్షణ, గౌరవాన్ని కాపాడాలి
– డీజీపీ ఆనంద్ హెచ్చరిక

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: పోలీసు యూనిఫామ్లో ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడం, డ్యాన్సులు వేయడం వంటి చర్యలపై డీజీపీ సీవీ ఆనంద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాకీ దుస్తుల్లో రీల్స్, డ్యాన్సులు చేయడం నిబంధనలకు విరుద్ధమని, ఇలాంటి చర్యలకు పాల్పడే సిబ్బందిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తప్పవని అధికారులకు స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు. కొంతకాలంగా రకరకాల ప్రైవేట్ ఈవెంట్లలో, సాంస్కృతిక కార్యక్రమాల్లో విధి నిర్వహణలో లేదా యూనిఫామ్ లో ఉన్న పోలీసులు డ్యాన్స్ వేసిన వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలపై నెటిజన్ల నుంచి, ప్రజా సంఘాల నుంచి తీవ్ర చర్చ జరగడమే కాక క్రమశి క్షణకు మారుపేరైన పోలీసు శాఖ ప్రతిష్ట దిగజారుతోందన్న విమర్శలు తారస్థాయికి చేరాయి. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన డీజీపీ ఆనంద్ ఈ ఆదేశాలను జారీ చేశారు. పోలీసు యూనిఫామ్ అనేది దుస్తులు మాత్రమే కాదని, అది బాధ్యత, అధికారం, అత్యున్నత క్రమశిక్షణకు ప్రతీక అని డీజీపీ స్పష్టం చేశారు. ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది ఆ దుస్తుల గౌరవాన్ని, సమాజంలో పోలీస్ వ్యవ స్థకున్న మర్యాదను కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇకపై యూనిఫామ్ లో డ్యాన్సు లు చేసినా, విధి నిర్వహణకు సంబంధం లేని ప్రైవేట్ కార్యక్రమాల్లో యూనిఫామ్ లో పాల్గొన్నా శాఖాపరమైన విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *