కన్నతండ్రే కాలయముడయ్యాడు

– ఇద్దరు చిన్నారులకు ఉరివేసి తండ్రి ఆత్మహత్య
– మద్యం మత్తులో ఘాతుకం
– అమ్మాపురం గ్రామంలో విషాదం]

తొర్రూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : నాన్న వెంట వెళ్తే రక్షణ ఉంటుందన్న ఆ చిన్నారుల నమ్మకమే వారి పాలిట శాపమైంది. చాక్లెట్లు కొనిస్తాడన్న తండ్రి మాటలు నమ్మి హుషారుగా బైక్ ఎక్కిన ఆ పసి ప్రాణాలు అనంత లోకాలకు చేరాయి. మద్యం మత్తులో ఓ కన్నతండ్రి తన ఇద్దరు కుమారులను అతి దారు ణంగా హత్య చేసి, తాను కూడా ఆత్మ హత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మం డల పరిధిలో తీవ్ర కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని అమ్మాపురం గ్రామా నికి చెందిన కిన్నెర గుంషావళి (29), అదే గ్రామానికి చెందిన కిన్నెర కాంతను 11 ఏళ్ల క్రితం వివాహమాడాడు. వారికి విన్య, విలాస్ (5), వికేష్ (3) పిల్లలు ఉన్నారు. గుంషావలి తొర్రూరులోని ఓ బైక్ మెకానిక్ షాప్ లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే మద్యానికి బానిసైన అతడు వచ్చే డబ్బులతో తాగి నిత్యం
భార్యతో గొడవకు దిగేవాడు. పది రోజుల క్రితం భార్య కాంతతో గొడవపడగా అదే గ్రామంలోని నానమ్మ సీతమ్మ ఇంటికి పిల్లలను తీసుకొని వెళ్లింది. పది రోజులుగా పిల్లల కోసం భార్య, నానమ్మ ఇంటికి వెళుతుండగా ఆమె పంపించలేదు. సోమవారం భార్య కూలి పనికి వెళ్లగా ఇద్దరు కుమారులు ఇంటి వద్దనే ఉన్నారు. కూతురు ఆడుకోవడానికి మరోచోటకి వెళ్లింది. పిల్లలను తన దగ్గరికి రానివ్వడం లేదని, తనకు దక్కని పిల్లలు ఎవరికీ దక్కవద్దనే ఉద్దేశంతో బుధవారం ఉదయం మద్యం సేవించి ఆడుకుంటున్న ఇద్దరు కుమారులను బైక్ పై  ఎక్కించుకొని తొర్రూర్ వెళ్లాడు. చాక్లెట్లు కొనిస్తానని ఆశ చూపగా పిల్లలు హుషారుగా తండ్రి బైక్ పై ఎక్కారు. పట్టణం లోని ఓ దుకాణంలో తాళ్లు కొనుగోలు చేశాడు. సాయంత్రం పనికి వెళ్లిన భార్య ఇంటికి వచ్చి కుమార్తె విన్యను అడగగా నాన్న తీసుకువెళ్లాడని బదులిచ్చింది. ఆందోళన చెందిన కాంత స్థానికుల సహాయంతో ఊరంతా గాలించినా ఆచూకీ లభించలేదు. అయితే ఉదయం కొంత సమయం బైక్ పై తొర్రూరులో తిప్పి పట్టణ శివారు వ్యవసాయ మార్కెట్ వైపు తీసుకువెళ్లాడు. ఇద్దరు పిల్లలు ఆనందంగా కేరింతలు కొడుతున్న సమయంలో పిల్లల మెడకు తాళ్లు కట్టి చెట్టు కొమ్మకు ఉరివేశాడు. ప్రాణాలు పోయాక ఈ విషయం బయటకు తెలుస్తుందని భయపడ్డ నిందితుడు కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాంత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *