– నిర్వహణ లోపాలే కారణమని ఫిర్యాదు
శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : అపార్ట్‌మెంట్ లిఫ్ట్ ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. నల్లగండ్ల ఎస్‌సి కాలనీకి చెందిన దాడి శ్రీనివాస్, ఆయన భార్య అనసూయ తమ మేనమామను పరామర్శించేందుకు చాట్వాజ్ మాన్షన్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో లిఫ్ట్ కోసం ఎదురు చూస్తుండగా తలుపులు తెరుచుకున్నాయి. శ్రీనివాస్ ముందుగా లిఫ్ట్‌లోకి వెళ్లగా ఆయన భార్య అనసూయ ఒక కాలు లోపల పెట్టి రెండో కాలు పెట్ఠేలోగానే లిఫ్ట్ అకస్మాత్తుగా పైకి కదిలింది. దీంతో ఆమె లిఫ్ట్, ప్రవేశ ద్వారం మధ్య ఇరుక్కుపోయి తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్థానికులు వెంటనే ఆమెను బయటకు తీసి చందానగర్‌లోని అర్చనా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి వైద్యులు ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించారు. అనంతరం మృతదేహాన్ని నిజాంపేటలోని హోలిస్టిక్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాద సమయంలో లిఫ్ట్‌కు మరమ్మతులు జరుగుతున్నాయని, అయినా లిఫ్ట్ నిర్వహణ టెక్నీషియన్ అనిల్ కుమార్ ప్రధాన విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా, ఎలాంటి హెచ్చరిక బోర్డు పెట్టకుండా పనులు చేపట్టాడని శ్రీనివాస్ ఆరోపించారు. అపార్ట్‌మెంట్ అసోసియేషన్ సభ్యులు రాంరెడ్డి, యోగేందర్, వెంకట్ రెడ్డి, లిఫ్ట్ మెయింటెనెన్స్ కంపెనీ జాన్సన్ ఎలివేటర్స్ యాజమాన్యం నివాసితుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ చందానగర్ పోలీసులకు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
——————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





