నిమ్స్‌లో యువతి పట్ల అసభ్య ప్రవర్తన

– అటెండెంట్‌ ‌తీరుపై పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: ‌నగరంలోని పంజాగుట్ట నిమ్స్ ‌హాస్పిటల్‌లో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం వచ్చిన యువతిపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదంలో యువతికి రెండు కాళ్లు విరగడంతో ఆమెను కుటుంబ సభ్యులు నిమ్స్ ‌హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలో తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్యలో పక్క బెడ్‌పై ఉన్న మరో రోగి అటెండెంట్‌ ‌యువతిపై అసభ్యంగా ప్రవర్తించాడు. వ్యక్తి తీరుతో యువతి తీవ్ర భయాందోళనకు గురైంది. వెంటనే జరిగిన విషయాన్ని యువతి మరుసటి రోజు తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ఈ విషయంపై యువతి తండ్రి, ఆర్‌ఎం‌పీ వైద్యుడు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *