యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 05: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆదివారం కుటుంబ సమేతంగా రాష్ట్ర డిజిపి బి శివధర్ రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా కొండపైకి చేరుకున్న డిజిపి బి శివధర్ రెడ్ది కి ఆలయ సంప్రదాయ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ్య మండపంలో వేద పండితులు వేదశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామి వారి చిత్రపటం,లడ్డు ప్రసాదం అందజేసారు.
స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న రాష్ట్ర డిజిపి బి శివధర్ రెడ్ది..





