వివాహేతర సంబంధం .. భార్యను హత్య చేసిన భర్త

నాగర్‌కర్నూల్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగస్ట్ 13: ‌నాగర్‌ ‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం కోట్ర గ్రామానికి చెందిన వివాహిత దారుణ హత్యకు గురైంది. గ్రామానికి చెందిన నారుమళ్ల అనూష(22) కల్వకుర్తి పట్టణంలోని ఓ లేడీస్‌ ‌కార్నర్‌లో పనిచేస్తోంది. ఆమె భర్త చెన్నయ్య ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. అనూష అదే గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తితో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి రాములు అనూషను ఒడ్దోనిరాళ్ల వద్దకు తీసుకెళ్లి హత్య చేసి ఆపై పెట్రోల్‌ ‌పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి పరార‌య్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. రాములుతోపాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కల్వకుర్తి, వెల్దండ సీఐలు భీమ్‌కుమార్‌, ‌రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *