క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం కావాలి

– నాయకులు, కార్యకర్తలకు పీసీసీ చీఫ్‌ దిశానిర్దేశం

నిజామాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 19 : జిల్లా కేంద్రంలోని దుబ్బలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కాంగ్రెస్ పీఏసీ సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రి సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, గ్రామస్థాయి నుంచి పార్టీ విస్తరణ, ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణ తదితర అంశాలపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతానికి ప్రత్యేక కృషి చేస్తున్న డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ జిల్లాలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్, నిజామాబాద్ అర్బన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, కామారెడ్డి డీసీసీ మాజీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, పీఏసీ సభ్యులు, డీసీసీ నాయకులు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, సమష్టి నాయకత్వం, ప్రజలతో మమేకమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *