సుక్కూర్ బ్యారేజి కన్సల్టెంట్ ఇంజనీర్ గా అలీ నవాజ్ జంగ్

-శ్రీధర్ రావు దేశ్ పాండే

భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరాయతో కలిసి మూసీ వరద నివారణ ప్రాజెక్టులపై కలిసి పని చేసిన మరొక వ్యక్తి నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదూర్ అన్న సంగతి తెలిసిందే. ఈ సంగతులన్నీ “ఉస్మాన్ సాగర్ – హిమాయత్ సాగర్ జంట జలాశయాలు” అన్న అధ్యాయంలో వివరంగా చర్చించాను. అయితే మోక్షగుండం విశ్వేశ్వరాయతో కలిసి ఆయన మరొక ప్రాజెక్టులో కూడా కన్సల్టింగ్ ఇంజనీర్ గా సేవలు అందించాడు. అదే సుక్కూర్ బ్యారేజి. స్వాతంత్ర్యానికి పూర్వం సింధ్ రాష్ట్రంలో సింధు నదిపై నిర్మించిన సుక్కూర్ బ్యారేజి దేశ విభజనానంతరం పాకిస్తాన్ కు వెళ్ళిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ వ్యవసాయ రంగానికి, పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థకు సుక్కూర్ బ్యారేజి వెన్నెముక లాంటిది. సుక్కూర్ బ్యారేజి నిర్మాణ పనులకు సంబంధించి ఇద్దరు మహానీయుల సేవల గురించి తెలుసుకునే ముందు సుక్కూరు బ్యారేజి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాము.

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో సింధు నదిపై నిర్మించిన అద్భుతమైన నీటిపారుదల వ్యవస్థ సుక్కూర్ బ్యారేజి . బ్రిటీష్ జమానాలో 1923-1932 మధ్య నిర్మించిన దీనిని మొదట్లో ‘లాయిడ్ బ్యారేజ్’ అని పిలిచేవారు. ఇది దాదాపు 1.5 కిలోమీటర్ల పొడవును కలిగి ఉండి, ప్రపంచంలోనే అతిపెద్ద ఏకైక సాగునీటి వ్యవస్థగా గుర్తింపు పొందింది.

  • నిర్మాణ కాలం: 1923 నుండి 1932 వరకు.
  • పొడవు: దాదాపు 1,500 మీటర్లు (4,925 అడుగులు).
  • గేట్లు: మొత్తం 66 గేట్లు
  • స్పెల్ వే డిశ్చార్జ్ సామర్థ్యం : 11.50 లక్షల క్యూసెక్కులు
  • ఈ బ్యారేజి ద్వారా వ్యవసాయానికి నీరందించేందుకు మొత్తం 7 ప్రధాన కాలువలు ఉన్నాయి.
  • ఎడమ ఒడ్డున ఉన్న కాలువల్లో నారా కాలువ, రోహ్రి కాలువ ముఖ్యమైనవి.
  • వీటి కాలువల వ్యవస్థ ద్వారా కొన్ని లక్షల ఎకరాల భూమికి (గోధుమలు, పత్తి, వరి, చెరకు వంటి పంటలకు) సాగునీరు అందుతుంది.

ఈ ఆనకట్ట నుండి విడివడే ఏడు కాలువలలో ఒకటైన నారా కాలువ పాకిస్తాన్  దేశంలోనే అత్యంత పొడవైన కాలువ. ఇది లండన్‌లోని థేమ్స్ నది ప్రవాహానికి దాదాపు సమానమైన ప్రవాహా సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని బెడ్ వెడల్పు 105 మీటర్లు (346 అడుగులు). సూయజ్ కాలువ కంటే 1/2 రెట్లు పెద్దది.  ఈ కాలువ 9,30,000 హెక్టార్ల (23,00,000 ఎకరాలు) ఆయకట్టుకు సాగునీటిని అందిస్తుంది. [

తరువాతి అతిపెద్ద కాలువ రోహ్రీ కాలువ. ఇది నారా కాలువ కంటే పొడవులో కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ, దాని కంటే చాలా ఎక్కువ నీటిని సరఫరా చేస్తుంది. దీని కింద 11 లక్షల హెక్టార్ల (26 లక్షల ఎకరాలు) సాగుభూమి ఉంది. ఈ కాలువ వ్యవస్థపై పత్తి , గోధుమచెరకు ప్రధాన పంటలుగా పండిస్తారు. 

సింధు నదికి ఎడమ వైపున ఉన్న నాలుగు కాలువలు, కుడి ఒడ్డున ఉన్న రెండు కాలువలు నిరంతరం ఏడాది పొడవునా సాగునీటిని సరఫరాను చేస్తాయి. కుడి వైపున ఉన్న ఏడవ కాలువ ఖరీఫ్ పంట కాలంలో మాత్రమే ప్రవహిస్తుంది. వరి సాగు కోసం మాత్రమే నిర్మించబడింది. కుడి ఒడ్డున ఉన్న వాయువ్య కాలువ 3,91,000 హెక్టార్ల (9,65,000 ఎకరాలు) ఆయకట్టుకు నిరంతర సాగునీటి సౌకర్యాన్ని అందిస్తుంది. ఇందులో 74,000 హెక్టార్లు (1,84,000 ఎకరాలు) బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉన్నాయి.

ఈ బ్యారేజ్ పాకిస్తాన్ వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలుస్తుంది. దీని నిర్మాణం వల్ల సింధ్ ప్రావిన్స్ ఆర్థికంగా, వ్యవసాయపరంగా ఎంతో అభివృద్ధి చెందింది.

ఇంతటి బృహత్తర ప్రాజెక్టు పనులు మందకొడిగా సాగుతున్నందున, బ్యారేజి పనులపై అనేక ఆరోపణలు పత్రికల్లో రిపోర్ట్ అవుతున్న కారణంగా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సుక్కూరు బ్యారేజిలో సాంకేతిక సమస్యలను అధ్యయనం చేసి, బ్యారేజి పనులను వేగవంతం చేయడానికి సూచనలతో ఒక నివేదికను తయారు చేయడానికి మోక్షగుండం విశ్వేశ్వరాయ, నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ లతో ఒక కమిటిని 1929 లో నియమించింది. వారిద్దరూ కలిసి ఈ బ్యారేజి పనులను సందర్శించి, సమస్యలను అధ్యయనం చేసి, పరిష్కారాలను సూచిస్తూ మూడు నెలల్లో ఒక నివేదికని ప్రభుత్వానికి సమర్పించారు. ఈ సంగతిని మోక్షగుండం 1951 లో ప్రచురించిన తన ఆత్మకథ “Memoirs of My Working Life” 14 అధ్యాయంలో వివరించారు. ఈ అధ్యాయంలో    ఎం వి ఆ కాలంలో ఏర్పాటు అయిన వివిధ రకాల కమిటీలలో సభ్యుడిగా / చైర్మన్ గా తాను అందించిన సేవలను వివరించారు. అందులో ఒకటి ‘సుక్కూరు బ్యారేజి కమిటి’. సుక్కూరు బ్యారేజి కమిటి గురించి ఆ పుస్తకంలో మోక్షగుండం విశ్వేశ్వరాయ ఈ రకంగా రాసుకున్నారు.

          “సింధ్‌ రాష్ట్రంలో సింధు నదిపై సుక్కూర్  బ్యారేజీ నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపై పనులకు సంబంధించిన తీరుతెన్నులపై పత్రికల్లో పలు ఫిర్యాదులు వచ్చాయి. సుక్కూర్  బ్యారేజి పనుల ప్రస్తుత  స్థితిగతులుభవిష్యత్ అవసరాలపై దర్యాప్తు చేసి నివేదించడానికి  కేవలం భారతీయ ఇంజనీర్లతో కూడిన ఒక కమిటీని నియమించడం అవసరమని బొంబాయి ప్రభుత్వం భావించింది కమిటిలో ప్రభుత్వం ఇద్దరు సభ్యులను  నియమించిందివారిలో నేను సీనియర్ సభ్యుడినిరెండవ సభ్యుడు హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్  శ్రీ  అహ్మద్ అలీ (తర్వాత నవాబ్ అలీ నవాజ్ జంగ్). ఇతని గురించి ఇది వరకే ఒక అధ్యాయంలో ప్రస్తావించి ఉన్నానుఈయన ఇంజనీరింగ్ విద్యలో ఇంగ్లాండ్ లో శిక్షణ పొందారు.  

          మేము దాదాపు మూడున్నర నెలల పాటు సంవత్సరంలో అత్యంత వేడిగా ఉండే సమయంలో పని చేసాముబ్యారేజినినిర్మించిన కొత్త కాలువలను సందర్శించాము తర్వాత ఒక సమగ్ర నివేదికను సమర్పించాముబొంబాయి ప్రభుత్వం మా నివేదికను సంతృప్తికరంగా ఉందని భావించి ఆమోదించిందినివేదికను అంగీకరిస్తూ  సమయంలో బొంబాయి గవర్నర్ గా ఉన్న సర్ ఫ్రెడరిక్ సైక్స్ నాకు ఒక లేఖ రాశారు లేఖలో వారు  విధంగా రాశారు.

         1929 నాటికే నవాబ్ అలీ నవాజ్ జంగ్ ప్రతిభా సామర్థ్యాలు భారతదేశం మొత్తంలో వ్యాప్తిలో ఉందని ఈ ఉదంతం తెలియజేస్తుంది. ఆ తర్వాత 1938 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వారు ఏర్పాటు చేసిన “నేషనల్ ప్లానింగ్ కమిటి” వివిధ రంగాలపై.. విద్యా, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మహిళాభివృద్ధి తదితర రంగాలపై.. నిపుణులచే సబ్ కమిటీలను వేసి సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికలను తయారు చేయించింది. అటువంటి “River Training  and  Irrigation” సబ్ కమిటికి చైర్మన్ గా మన హైదరాబాద్ లెజెండ్ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదూర్ నే ఎన్నుకున్నాడు నేషనల్ ప్లానింగ్ కమిటి చైర్మన్ గా వ్యవహరించిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *