– దరఖాస్తు చివరి తేది 5
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3 : బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంబీఏ, ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 5 చివరి తేది అని ఓపెన్ వర్సిటీ విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. వై.వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయంలో ఎంబీఏలోగాని, ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ లో గాని చేరాలంటే తెలంగాణ ఐసెట్ లోగాని, ఓపెన్ యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ ప్రరీక్షలోగానీ తప్పని సరిగా అర్హత సాధించాలి. డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ దరఖాస్తు చేయాలంటే డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ లకు 45 శాతం మర్కులు తప్పనిసరి. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారు అపోలో హాస్పిటల్, కిమ్స్, దక్కన్ మెడికల్ కాలేజీలోని ఎంబీఏ, ఆర్‌వీఎం హాస్పిటల్, రెనోవా హాస్పిటల్ హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ అడ్మిషన్ పొందవచ్చు. యూనివర్సిటీలోని జనరల్ ఎంబీఏలో చేరాలన్నా ఈ ప్రవేశ పరీక్ష రాయలన్నారు. వివరాలకోసం 040-23680333 / 555 ఫోన్ నంబర్లలో కాల్ చేయాలని లేదా www.braouonline.in లో వివరాలు పొందాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





