– అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్న ఎన్‌ఐఏ
పెద్దపల్లి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 :పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ఉగ్ర లింకులు కలకలం రేపాయి. అయోధ్య నగర్‌లో నేషనల్ ఇన్‌వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) తనిఖీల్లో ఈ విషయాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో రామగుండానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్‌ను ఎన్‌ఐఎ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముజామిల్ ఖాన్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ముజామిల్‌ను ఎన్‌ఐఏ అధికారులు.. ఎన్‌టీపీసీ పోలీస్‌స్టేషన్‌కు తరలించి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అతడి కార్యకలాపాలు, పరిచయాలు, ఉగ్రవాద సంస్థలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు