రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్ల‌ మృతి

రఘునాథపాలెం/ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ఊహించని ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. రఘునాథపాలెం మండలంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం వరసకు అన్నాచెల్లెలి ప్రాణాలను బలితీసుకుంది. మండలంలోని జింకలతండా సమీపంలోని గ్రీన్ కాలనీకి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి గుండేటి శ్రీను(18) శనివారం ఉదయం బైకుపై ఖమ్మం వచ్చాడు. వరసకు చెల్లెలు అయిన ఖమ్మం రమణగుట్టకు చెందిన గార్లపాటి రిషిక (10) తమ ఇంటికి వస్తానని చెప్పడంతో శ్రీను బైక్ పై తిరుగు పయనమయ్యాడు. ఈ క్రమంలో జింకలతండా వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా బైక్ ను ఎదురుగా ఇల్లేందు నుంచి ఖమ్మం వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో రిషిక, శ్రీను(ఫైల్) రోడ్డుపై పడడంతో రిషిక అక్కడికక్కడే మృతిచెందింది. శ్రీనును దవాఖానకు తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రఘునాథపాలెం ఇన్‌స్పెక్టర్ ఉస్మాన్ షరీఫ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *