డిమాండ్ల సాధనకు ఉద్యోగుల నిరసన

– టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో..

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో భాగంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో భీమ భవన్, తిలక్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్ (పీఏవో కార్యాలయాల సమీపంలో) ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం టీజీఈజేఏసీ హైదరాబాద్ సిటీ చైైర్మన్ కట్కూరి శ్రీకాంత్, కన్వీనర్ గూడూరి వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా మారం జగదీశ్వర్ (చైర్మన్, టీజీఈజేఏసీ), ఎలూరి శ్రీనివాసరావు(సెక్రటరీ జనరల్, టీజీఈజేఏసీ) ఎసఎం హుస్సేని (ముజీబ్) (డిప్యూటీ సెక్రటరీ జనరల్), బి.శ్యామ్ స్థిత ప్రజ్ఞ హాజరయ్యారు. కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు కె.వెంకటేశ్వర్లు, సత్యనారాయణ గౌడ్, పి.హరికృష్ణ, నిరంజన్ రెడ్డి, నరేంద్రరావు, లక్ష్మణ్, శ్రీనివాస్, కృష్ణ, జి.శ్రీనివాస్ గౌడ్, వి.నాగిరెడ్డి, జి.అమరేందర్, బి.బాబుశంకర్, కె.స్వరూప తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, సీపీఎస్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు మద్దతు తెలిపారు. 51% ఫిట్‌మెంట్‌తో పి.ఆర్.సి ప్రకటించాలి, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ అమలు చేయాలి, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతిని అమలు చేయాలి, సెక్రటేరియట్‌లో 12.5% కోటా అమలు చేయాలి, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి అనేవి ప్రధాన డిమాండ్లు.

పీఆర్సీ అమలు, పాత పెన్షన్ విధానం తేవాలి : అంబేద్కర్ వ‌ర్సిటీలో ఉద్యోగుల నిరసన

పి.ఆర్.సి., పాత పెన్షన్ విధానం వెంటనే అమలు చేయాలని, ఉద్యోగుల హెల్త్ కార్డ్, పెండింగ్లో ఉన్న 5 డి.ఎలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డా. బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ తెలంగాణ విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగుల సంఘం (తుంటీయ), తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు శుక్రవారం డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల సభ్యలు మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి పి.ఆర్.సి. వెంటనే అమలు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని (ఓ.పి.ఎస్.) ప్రవేశ పెట్టాలని, ఉద్యోగులు వారి కుటుంభసభ్యులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డ్లు జారీ చేయాలని, పెండింగ్లో ఉన్న ఐదు డి.ఎ.లు వెంటనే విడుదల చేయాలంటూ ఉద్యోగులు నినాదాలు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *