విద్యుత్‌ ‌సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలి

అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్

ఎ‌ర్రుపాలెం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ‌విద్యుత్‌ ‌సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ అధికారులు సక్రమంగా పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు పట్టి విక్రమార్క ఆదేశించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని రేమిడిచర్ల గ్రామ సమీపంలో సుమారు రూ3.5కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 33/11 కెవి నూతన విద్యుత్‌ ‌ట్రాన్స్‌ఫార్మ‌ర్‌కు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గతంలో విద్యుత్‌ ‌కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతుండడంతో ప్రజల విద్యుత్తు ఇబ్బందులు తొలగించి నిరంతర విద్యుత్‌ ‌సరఫరా అందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకొని మూడున్నర కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు.అలాగే విద్యుత్‌ అధికారులు సక్రమంగా పనిచేసి   విద్యుత్‌ అం‌తరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.ఈ శంకుస్థాపన కార్యక్రమం ముందుగా వచ్చిన జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ‌దురిశెట్టి ఏర్పాట్లను పరిశీలించి డిప్యూటీ సీఎం ప్రోగ్రాం అఫీషియల్‌ ‌గా ముందుగా తెలిసినప్పటికీ, అధికారులు, డిప్యూటీ సీఎం వచ్చే ముందు అరగంట క్రితం హడావుడి చేసి ఏర్పాట్లు చేయడంపై విద్యుత్‌ ‌శాఖ ఆర్‌ అం‌డ్‌ ‌బి అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌ అసహనానికి గురై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రేమిడిచర్ల గ్రామంలో నుండి ప్రవహించే కొండ వాగు ఆక్రమణకు గురై నీళ్లు ప్రవహించలేక వాగు సమీపంలోని బీసీ కాలనీ ఎస్సీ కాలనీ నివాసాలు ముంపు కు గురవుతున్నాయని  గ్రామంలోని వాగును ఆక్రమణ విడగొట్టి వాగుమంప గురికాకుండా కాపాడాలని డిప్యూటీ సీఎం మార్కకు వినతిపత్రం అందించారు.స్పందించిన ఆయన వెంటనే మూడు రోజుల్లో వాగు  ఆక్రమణ తొలగించి వాగు మరమ్మత్తులు సంబంధించిన ఎస్టిమేషన్ను ఇవ్వాలని ఇరిగేషన్‌ ‌సంబంధిత అధికారులను ఆదేశించారు.అనంతరం అయ్యవారిగూడెం గ్రామంలో ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్‌ ‌కార్యకర్త,వెంకట్‌ ‌నారాయణ రెడ్డి, కుటుంబ సభ్యులను డిప్యూటీ సీ.ఎం, మల్లు భట్టి విక్రమార్క, పరామర్శించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ‌దురిశెట్టి, ఏ.ఏం.సి, చైర్మన్‌, ‌బండారు.నరసింహారావు, కాంగ్రెస్‌ ‌పార్టీ మండల అధ్యక్షుడు, వేమిరెడ్డి.సుధాకర్‌ ‌రెడ్డి, జిల్లా యూత్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు, వేజెండ్ల.సాయికుమార్‌, ‌మాజీ ఏఎంసి.చైర్మన్‌, ‌సీనియర్‌ ‌నాయకులు, చావా.రామకృష్ణ, జిల్లా నాయకులు, యర్రమల.పూర్ణచంద్రారెడ్డి, ఐలూరి.వెంకటేశ్వర రెడ్డి, నాయకులు, గంటా.శ్రీనివాసరావు, అనుమోలు కృష్ణారావు, ఇస్మాయిల్‌, ‌వెంకట నరసయ్య, ఏం.అప్పారావు, యనమందల.నాగేశ్వరరావు యనమందల.శివన్నారాయణ, ఎం.కాంతారావు, సిహెచ్‌, ‌పురుషోత్తం రాజు, ఎస్‌.‌చెన్నకేశవరావు, పి.వెంకట్‌ ‌నారాయణ,డి.రాజీవ్‌ ‌గాంధీ, జి.బాబు, డి.శ్రీను, కే.రంగారావు, కే సాంబశివరావు,అధికారులు, విద్యుత్‌, ‌సిఎండి, వరుణ్‌ ‌రెడ్డి, డి ఈ. బి.శ్రీనివాసరావు, ఆర్‌.ఐ, ‌రవికుమార్‌, ఎం‌పీడీవో, సురేందర్‌ ‌నాయక్‌, ‌శ్రీలక్ష్మి, ఐ సి డి ఎస్‌, ఎ. ‌సి.డి.పి ఓ, కృష్ణ శ్రీ, సూపర్వైజర్‌, ‌సునీత, పలువురు, అధికారులు, పలువురు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page