– కేంద్రంపై మండిపడ్డ మంత్రి ఉత్తమ్ కుమార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధర పెంచడంపై నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఇది సామాన్యుడిపై పెనుభారం మోపే నిర్ణయమని దుయ్యబట్టారు. 19 కేజీల గ్యాస్ ధరను రూ.993 అంటే సుమారు రూ.1000 పెంచడంపై శుక్రవారం ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. ఒక్కసారిగా 30 నుండి 35 శాతం పెంచడంతో హోటళ్లు, కేఫ్‌లు, రెస్టారెంట్లు సహా చిన్నతరహా వీధి వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు పూర్తి కాగానే కమర్షియల్ గ్యాస్ ధర పెంచడం అంటే సామాన్యులను మోసం చేయడమేనని ఆయన విమర్శించారు. పెంచిన ధరలతో 19 కేజీల గ్యాస్ ధర రూ.3 వేలకు మించిపోయిందన్నారు. ఈ పెరుగుదలతో సామాన్యుల జీవన ప్రమాణాలపై కోలుకోలేని దెబ్బ పడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ధరల పెంపు నిర్ణయాన్ని ఉపసంహారించుకోవాలని మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





