హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో సాధించిన విజయాలను విశ్లేషిస్తూ, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్‌రావు రచించిన శ్రీ నరేంద్ర మోదీ-నిబద్ధ పరిపాలన దక్షుడు అనే గ్రంథాన్నిమంగళవారం నల్లకుంట శంకరమఠంలో శ్రీశృంగేరి శారదా పీఠాధిపతి శ్రీశ్రీ వవిధుశేఖర భారతీ స్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామిజీ, గ్రంథంలోని అంశాలపై రచయితతో సమగ్రంగా సంభాషించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్వామిజీ, రచయితను ఆశీర్వదించి, ప్రసాదంతో పాటు గోడ గడియారాన్ని బహుమతిగా అందజేశారు. తరువాత మీడియాత మాట్లాడిన డా. వకుళాభరణం మాట్లాడుతూ “మోదీజీ 75వ జన్మదినం సందర్భంగా గత సెప్టెంబర్ 17న నేను ఒక ప్రత్యేక వ్యాసావళి రచించి ఆవిష్కరించాను. కాగా ఇప్పుడు ఆయన పదేళ్ల పాలనలో సాధించిన విజయాలపై సమగ్ర అధ్యయనం చేసి ఈ గ్రంథాన్ని రచించాను. దేశానికే కాక, ప్రపంచానికి అందించిన ఆయన నాయకత్వాన్ని పత్రికా ఆధారాలతో అందరికీ చేరువ చేయడం నా లక్ష్యం” అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





