– ఓటర్ల ఫిర్యాదులకు తక్షణ పరిష్కారమే లక్ష్యం
– భారత ఎన్నికల సంఘం
దిల్లీ, అక్టోబర్ 29: ఓటర్ల ఫిర్యాదులను సమయానుసారం పరిష్కరించేందుకు భారత ఎన్నికల సంఘం జాతీయ ఓటరు హెల్ప్‌లైన్, బుక్ ఏ కాల్ విత్ బీఎల్‌వో సౌకర్యాన్ని, 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని రాష్ట్ర, జిల్లాస్థాయి హెల్ప్ లైన్‌లను ప్రారంభించింది. జాతీయ సంప్రదింపు కేంద్రం(నేషనల్ కాంటాక్టు సెంటర్) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం ప్రధాన హెల్ప్‌లైన్‌గా పనిచేస్తుంది. ఇది రోజూ ఉదయం 8 నుండి సాయంత్రం 8 గంటల వరకు పనిచేస్తుంది. టోల్-ఫ్రీ నంబర్ 1800-11-1950 ద్వారా కాల్ చేయవచ్చు. శిక్షణ పొందిన సిబ్బంది ఓటర్లకు, ఇతర భాగస్వామ్యులకు ఎన్నికల సేవల గురించి సమాచారం అందిస్తారు. ఎన్నికల సంఘం ప్రతి రాష్ట్రం/ యూనియన్ టెరిటరీ, జిల్లాకు స్టేట్ కాంటాక్టు సెంటర్(ఎస్‌సీసీ), డిస్ట్రిక్టు కాంటాక్టు సెంటర్(డీసీసీ) ఏర్పాటు చేయాలని సూచించింది. ఇవి ప్రాంతీయ భాషల్లో, కార్యాలయ సమయాల్లో అన్ని పని రోజులలో సహాయం అందిస్తాయి. అన్ని ఫిర్యాదులు, నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్(ఎన్‌జీఎస్‌పీ) ద్వారా నమోదు చేసి, వాటి పరిష్కారం ట్రాక్ చేయబడుతుంది. అదనంగా ఎన్నికల సంఘం ‘బుక్ ఏ కాల్ విత్ బీఎల్‌వో అనే సౌకర్యాన్ని కూడా ప్రారంభించింది. దీని ద్వారా ఓటర్లు తమకు సంబంధించిన బీఎల్‌వోను నేరుగా సంప్రదించవచ్చు. ఈ సౌకర్యం ఈసీఐఎన్‌ఈటీ ప్లాట్‌ఫామ్ ద్వారా అందుబాటులో ఉంది. పౌరులు ఈసీఐఎన్‌ఈటీ యాప్ ద్వారా కూడా ఎన్నికల అధికారులను సంప్రదించవచ్చు. సీఈవో, డీఈవో, ఈఆర్‌వోలు వినియోగదారుల అభ్యర్థనలను 48 గంటల్లో పరిష్కరించేలా పర్యవేక్షించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ కొత్త సౌకర్యాలతోపాటు, పాత ఫిర్యాదు వ్యవస్థలు కూడా కొనసాగుతాయి. ఓటర్లు తమ ఫిర్యాదులను complaints@eci.gov.inకు మెయిల్ ద్వారా పంపవచ్చు. ఎన్నికల సంఘం అన్ని ఓటర్లను బుక్ ఎ కాల్ విత్ బీఎల్‌వో, 1950 హెల్ప్‌లైన్ నంబర్ ఉపయోగించి తమ ప్రశ్నలు, అభిప్రాయాలు, సూచనలు, ఫిర్యాదులను తెలియజేయాలని ఎన్నికల సంఘం ప్రోత్సహిస్తోంది. తద్వారా వేగంగా, పారదర్శకంగా సమస్యలు పరిష్కారమవుతాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





