లకడికాపూల్‌లో పైపు లైను పనులు పూర్తి చేయాలి

– రహదారులపై నీరు నిలవకుండా చూడాలి
– క్షేత్రస్థాయిలో పర్యటించిన హైడ్రా, జీహెచ్‌ ఎంసీ కమిషనర్లు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: తీవ్ర తుపానుతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో లకడికాపూల్‌ పరిసర ప్రాంతాలను హైడ్రా, జీహెచ్‌ ఎంసీ కమిషనర్లు ఏవీ రంగనాథ్‌, ఆర్‌ వీ కర్ణన్‌లు పరిశీలించారు. మాసబ్‌ ట్యాంకు నుంచి లకడికాపూల్‌ వైపు వచ్చే మార్గంలో మెహదీ ఫంక్షన్‌ హాల్‌ వద్ద వర్షపు నీరు రోడ్డు మీద నిలవడానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ వర్షపు నీరు నిలవడంతో తీవ్ర ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయని, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కమిషనర్లు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఇక్కడ ఇరువైపులా రోడ్డును తవ్వి రెండు అడుగుల విస్తీర్ణంతో ఉన్న పైపులైన్లను వేశామని, వాటికి మహవీర్‌ హాస్పిటల్‌ పరిసరాలతోపాటు చింతలబస్తీ ప్రాంతాల నుంచి వచ్చిన మురుగు, వరద నీటిని అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. త్వరితగతిన ఈ పనులు కూడా పూర్తి చేయాలని సూచించారు. ఈలోగా మహావీర్‌ హాస్పిటల్‌ ముందు నుంచి మెహిదీ ఫంక్షన్‌ హాల్‌ వరకు రోడ్డుకు పక్కగా ఉన్న పైపులైన్లలో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తే సమస్య చాలావరకు పరిష్కారం అవుతుందని కమిషనర్లు సూచించారు. ఒకటి రెండు రోజుల్లో ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్‌ పోలీసులు కూడా సహకరించి పైపులైన్ల అనుసంధాన పనులు త్వరగా జరిగేలా సహకరించాలని సూచించారు. వీరితోపాటు హైడ్రా అదనపు సంచాలకుడు వర్ల పాపయ్య, ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాస్‌ కూడా ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page