ఎబోలా వైరస్‌ ‌విజృంభణ

– ఇండియా-ఆఫ్రికా సమిట్‌ ‌వాయిదా
– ఎయిర్‌పోర్ట్‌లో అడ్వయిజరీ జారీ

న్యూదిల్లీ, మే 21:ఆఫ్రికాలో ఎబోలా వైరస్‌ ‌విజృంభిస్తోంది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌ ‌వంటి దేశాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ పరిణామాల నడుమ దిల్లీ వేదికగా ఈ నెల 28-31 తేదీల మధ్య జరగాల్సిన ఇండియా- ఆఫ్రికా ఫోరమ్‌ ‌సమిట్‌ వాయిదా పడింది. భారత్‌, ఆ‌ఫ్రికన్‌ ‌యూనియన్‌ ‌కలిసి ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. కొత్త తేదీలను పరస్పర సంప్రదింపుల ద్వారా ఖరారు చేస్తామని తెలిపింది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజారోగ్యానికి సంబంధించి విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ఆఫ్రికా సీడీసీ, సంబంధిత సంస్థలకు మద్దతు ఇచ్చేందుకు భారత్‌ ‌సిద్ధంగా ఉందని విదేశాంగశాఖ పేర్కొంది. మరోవైపు ఎబోలా వైరస్‌ ‌వ్యవహారంలో దిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు కీలక అడ్వైజరీ జారీ చేసిన విషయం తెలిసిందే. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌ ‌నుంచి వచ్చే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జ్వరం, తలనొప్పి, నీరసం, కండరాల నొప్పులు తదితర సమస్యలు కనిపిస్తే వెంటనే ఎయిర్‌పోర్టు వైద్యసిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎబోలా కారణంగా ఇప్పటివరకు 139 మంది మృతి చెందారు. దాదాపు 600 అనుమానిత కేసులను గుర్తించారు. కాంగోలో వైరస్‌ ‌వ్యాప్తిని ఎదుర్కొనేందుకు తమకు మరింత సామగ్రి, సిబ్బంది అవసరమని అధికార వర్గాలు, సహాయక బృందాలు కోరాయి. మొదటి మరణం నమోదైన బునియా ప్రాంతానికి దాదాపు 20 టన్నుల సహాయ సామగ్రిని తరలించినప్పటికీ.. ఐసొలేషన్‌ ‌గదుల కొరత కారణంగా వైద్యులు సాధారణ వార్డుల్లోనే ఎబోలా అనుమానిత రోగులకు చికిత్స అందిస్తున్నారు.

తీవ్రమవుతున్న ఎబోలా : జాగ్రత్తలు ప్రకటించిన కేంద్రం

ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యా ప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపా లిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులు హాజరయ్యారు. ఎబోలా వైరస్ నివారణకు అవసరమైన ముందు జాగ్రత్తలు, ఆరోగ్య సన్నాహాలు, అత్యవసర స్పందన చర్యలపై సమగ్ర సక్ష నిర్వహించారు. ప్రస్తుతం భారత దేశంలో ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సృ ష్టం చేసింది. ఆఫ్రికా దేశాల్లో వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఐ) గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో కేంద్రం అప్రమత్త చర్యలు ప్రారంభించింది. దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవుల్లో నిఘా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల స్క్రీనింగ్, అనుమానితులను క్వారంటైన్లో ఉంచడం, ప్రత్యే క పరీక్షా సదుపాయాలు కల్పించడం వంటి అంశాలపై రాష్ట్రాలకు వివరణాత్మక మార్గద ర్శకాలు పంపింది. అదేవిధంగా ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని, వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించింది. గతంలో అంటువ్యాధుల సమ యంలో అమలు చేసిన విధానాలను మళ్లీ కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ప్రస్తుతం ఆఫ్రికా దేశమైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. అక్కడ అనేక కేసులు నమోదయ్యాయి. కాంగోతో పాటు ఉ గాండా, కెన్యా వంటి పొరుగు దేశాలకు కూడా వైరస్ వ్యాపించినట్లు సమాచారం. వందలాదిమంది అనుమానిత లక్షణాలతో వైద్య పర్యవేక్షణలో ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *