రైతులారా అధైర్యపడకండి

– చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా
– దేశ చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో 8,575 కొనుగోలు కేంద్రాలు
-ఇప్పటికే 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ.
– మద్దతు ధర ప్రకటించిన కేంద్రం చేతులు ఎత్తేసింది
– 16,479 కోట్ల భారం రాష్ట్రంపై మోపింది
– ఎంతటి భారమైనా రైతులకు న్యాయం చేస్తాం
– ఇది రైతులు ఎన్నుకున్న ప్రభుత్వం
– ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నాల మానుకోవాలి
– బీఆర్ఎస్ నేతలకు మంత్రి ఉత్తమ్ హితవు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28: అండగా ఉంటాం.. రాష్ట్ర రైతాంగం అధైర్య పడొద్దని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రా ష్ట్రంలో రైతుపక్షపాత ప్రభుత్వం ఏర్పడిందని, అటువంటి ప్రభుత్వం రైతాంగానికి వెన్నుదన్నుగా నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. రబీ సీజన్ లో చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో ఎటువంటి అపోహలకు ఆస్కారమే లేదని ఆయన తేల్చిచెప్పారు. రబీ సీజ నో తుది దశకు చెరుకున్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై సహచర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులతో కలసి భోనగిరి యాదాద్రి,పెద్దపల్లి, వరంగల్ జిల్లాలో గురువారం పర్య టించారు. ఈ సందర్భంగా యాదాద్రి జిల్లాలోని వంగపల్లి గ్రామంలో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మంత్రుల బృందం ఆ తదుపరి సమీపంలోని రామాజిపేటలోని భారత ఆహార సంస్థ కు చెందిన గోదాములో నిల్వ చేసిన ధాన్యాన్ని పరిశీలించింది.
అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఆయన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం శ్రీనివాస రెడ్డి, వేముల వీరేశం, మందుల శ్యామ్యాల్, పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జిల్లా కలెక్టర్.డి.సి.పి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రబీ సీజన్ లో మద్దతు ధర ప్రక టించిన కేంద్ర ప్రభుత్వం కొనుగోలు ప్ర క్రియలో 52 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమి తము అయ్యి చేతులు ఎత్తేసిందని ఆరోపించారు. దానితో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కొనుగోలు చేసిన 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను 16,479 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్రం భారం మోపిందని ఆయన విమర్శిం చారు. ఎంతటి భారమైనా రైతుల గురుంచి మోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. పారద ర్శకంగా దాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగు తుందని అయితే బీహార్, పశ్చిమ బెంగాల్ నుంచి వలస వచ్చిన కార్మికులు అక్కడ జరు గుతున్న ఎన్నికల్లో పాల్గొనేందుకు వెళ్లి తిరిగి రావడంలో ఒకింత ఇబ్బంది ఏర్పడిందని మిగితా వన్నీ సజావుగానే కొనసాగుతున్న్నా యాన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే మిగిలిన 28 రాష్ట్రలలో లేని విదంగా రికార్డ్ స్థాయిలో 8575 ధాన్యం కొనుగోలు కేంద్రా లను ప్రారంభించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రోజునుండి పంట పంటకు రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడి రావడమే కాకుం డా అంతే రికార్డ్ స్థాయిలో కొనుగోలు చేయ డం దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డ్ సృ ష్టించిందని ఆయన పేర్కొన్నారు. ఈ రబీ సీజ న్ లో ఇప్పటికే 58 లక్షల మెట్రిక్ టన్నుల ధా న్యాన్ని కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరో 17 లక్షలు కలిపి మొత్తం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టంగా
ప్రకటించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నేరుగా 11,000 వేల కోట్లు జమ చేసిందని ఆయన తెలిపారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో పాటు కేంద్రం పెట్టిన టార్గెట్ ను ఇప్పటి వరకు ఏ ఒక్కరూ చేరుకోలేదని మొట్ట మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం టార్గెట్ ను అధిగమించి రికార్డ్ స్థాయిలో కొనుగోలు జరుపుతున్నామని, ఇది రైతాంగం గమనించాలని విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్రం 52 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితమైతే అదే కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతోటే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 23 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి 16,479 కోట్ల అదనపు భారాన్ని భరిస్తున్నదని ఆయన వివరించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేసి సత్వరమే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొనుగోళ్ల ప్రక్రియ తుదిదశకు చేరుకుందని అకాల వర్షాలతోపాటు, రుతుపవనాలు వచ్చే లోపు మిగిలిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన కొనుగోళ్ల పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు వీలుగా ఇసుక రవాణా చేసే వాహనాలను, ఆయా ప్రాం
తాలలో ఫ్యాక్టరీలు వినియోగించే వాహనాలను ధాన్యం తరలింపుకు మళ్లించాలని ఆయన సూచించారు.

రైతులను తప్పుదారి పట్టించేలా బీజేపీ, బీఆర్ఎస్ కట్రలు

రాజకీయ ప్రయోజనాలనాశించే బి.ఆర్.ఎస్. బిజెపిలు రైతాంగాన్ని తప్పు దోవ పట్టించేం దుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి ఉత్తమ్ ఆరో పించారు. మద్దతు ధర ప్రకటించిన కేంద్రం ప్రభుత్వం కేంద్రం పెడుతున్న కొనుగోళ్ల టార్గెట్ ను పెంచేందుకు ఇక్కడి బిజెపి నేతలు కేం ద్రం మీద ఎందుకు వత్తిడి తేవడం లేదని సూటిగా ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై బి.ఆర్.ఎస్ కు చిత్తశుద్ధి ఎంతమాత్రం లేదని వారి పదేళ్ల పాలనతో పోల్చి చూసినప్పుడు రికార్డ్ స్థాయిలో దిగుబడి, కొనుగోళ్ళు జరిగాయని తెలిపారు. ప్రజల్లో గందరగోళం సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందలన్నది బి.ఆర్.ఎస్ నేతల ఉద్దేశ్యంగా కనిపిస్తోందన్నారు. రైతులకు నిజానిజాలు ఏమిటో అన్నది బాగా తెలుసని ఇది రైతులు ఎన్నుకున్న ప్రభుత్వమని తప్పు దోవ పట్టిస్తే తప్పు దోవ పట్టడానికి రైతులు సిద్ధంగా లేరన్నారు. ఇప్పటికైనా ఆ తరహా ప్రయత్నాలు మానుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హితవు పలికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *