అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను అడ్డుకోవద్దు

– రాష్ట్ర హైకోర్టు పోలీసులకు ఆదేశం
– ఉల్లంఘనపై స్పీకర్‌ ‌చర్యలు తీసుకుంటారు
– రాష్ట్ర హోం శాఖకు హైకోర్టు నోటీసులు జారీ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 7 : ‌శాసనసభకు వెళ్లే ఎమ్మెల్యేలను అడ్డుకోవద్దని రాష్ట్ర పోలీసులను హైకోర్టు సోమవారం ఆదేశించింది. శాసనసభ్యులు ఏవైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ వ్యవహారాన్ని స్పీకర్‌ ‌చూసుకుంటారని, పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అసెంబ్లీ సమీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉదంతంపై హోం శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణలో భాగంగా మహిళా ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులను గుర్తించాలని ఆదేశించింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికను సమర్పించాలని డీజీపీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఉదయం అసెంబ్లీ వద్ద జరిగిన పరిణామాల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *