పీకే ఓసీ-2 డీప్ సైడ్ సింగరేణికే కేటాయించాలి

– బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కూడా ఇవ్వాలి
– రూ.54 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి
– 20న రామగుండంలో నిరసన దీక్ష
-టీఆర్ఎస్ చీఫ్ కవిత

మణుగూరు, జూలై 10 (ప్రజాతంత్ర): మణుగూరు పీకే ఓసీ-2 డీప్ సైడ్ విస్తరణను ఎలాంటి షరతులు లేకుండా సింగరేణికే కేటాయించాలని హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త “బాయి బాట” కార్య క్రమంలో భాగంగా శుక్రవారం మణుగూరులో నిర్వహించిన పిట్ మీటింగ్లో ఆమె మాట్లాడారు. పీకే ఓసీ-2 డీప్ సైడ్ సింగరేణికి రాకపోతే మరో మూడేళ్లలో మణుగూరు ప్రాంత భవిష్యత్తు సంక్షోభంలో పడుతుందని, వేలాది మంది కార్మికులు, స్థానిక ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూ.54 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చే యాలని డిమాండ్ చేశారు. డిపెండెంట్ ఉద్యోగాలు కార్మికుల హక్కని పేర్కొన్న కవిత నెలలో రెండుసార్లు మెడికల్ బోర్డులు నిర్వహించి అర్హులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఈ నెల 20 లోపు సింగరేణి యాజమాన్యం స్పందించకపోతే రామగుండం ఏరియాలో నిరసన దీక్ష చేపడతామని హెచ్చరిం చారు. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని సింగరేణి సంస్థకే కేటా యించాలని పేర్కొన్నారు. సంస్థ పరిరక్షణ కోసం కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *