తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

– గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
– బతుకమ్మలతో పూల వనంగా కలెక్టరేట్ ప్రాంగణం

ములుగు, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నుంచి పుట్టిన విశి ష్టమైన పండుగ బతుకమ్మ అని పంచాయతీరా జ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ స్థాయిలో ఉన్నా మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగకు ఎంతో విశిష్టత ఉందన్నారు. పసుపుతో గౌరమ్మను రూపొందించి పూజించడం వంటి ఆచారాల్లో సంప్రదాయంతో పాటు శాస్త్రీయ దృక్పథం కూ దా మిళితమై ఉందని పేర్కొన్నారు. అందరూ కలిసి ఆడిపాడటం వల్ల ఆత్మీయత పెరుగుతుందని తెలిపారు. మహిళలు యాచిం చే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన అని పేర్కొన్నారు. ప్రజల ముఖాల్లో సంతోషం నింపేలా అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ బోర్ఖడే మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని, ఐక్యతను నింపుతుందని అన్నారు. తాను మహారాష్ట్రకు చెందినప్పటికీ తెలంగాణకు వచ్చిన తర్వాత ఇక్కడి బతుకమ్మ, దసరా వేడుకల విశిష్టతను తెలుసుకున్నానని తెలిపారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, మహిళలంతా కలిసి పాటలు పాడుతూ ఆడిపాడే దృశ్యం ఎంతో ఆకట్టుకుంటుందన్నారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో కార్యాలయ ప్రాంగణం పూలవనంగా మారింది. మహిళా ఉద్యోగులు బతుకమ్మ పాటలతో లయబద్ధంగా అడుగులు వేస్తూ ఉత్సాహంగా ఆడిపాడారు. అనంతరం ములుగు మండలానికి చెందిన 25 మంది, మల్లంపల్లి మండలానికి చెందిన ఏడుగురు కలిపి మొత్తం 32 మంది లబ్ధిదా రులకు రూ.32లక్షల విలువైన కల్యాణలక్షి. షాదీ ముబారక్ చెక్కులను మంత్రి సీతక్క పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి, సంపత్ రావు, ములుగు మున్సి పాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఆసియా షాహిన్, రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *