నిరాశ పరచిన విద్యా బడ్జెట్‌

యూపీఏ ప్రభుత్వ హాయం లో సోనియా గాంధీ నాయకత్వం లో కొన్ని ప్రజా హితమైన చట్టాలు వచ్చాయని చెప్పుకుంటాము. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం కూడా అందులో ఒకటి. రాష్ట్రం లో అధికారం లో ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ కేంద్రం లో తమ పార్టీ ఆధ్వర్యం లో తెచ్చిన చట్టాన్ని కనీసం మాట వరసకైన అమలు చేస్తామని ప్రకటించాక పోవడం విచారకరం.

2025-26 ‌సంవత్సరానికి ‘టీఎస్‌’ ‌విద్యా బడ్జెట్‌ ‌కేవలం 7.57% (రు.23,108 కోట్లు) మాత్రమే, ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన 15% కంటే చాలా తక్కువ. ఇది నిరాశాజనకం
25-26 ఆర్ధిక సంవత్సర రాష్ట్ర బడ్జెట్‌ ‌మొత్తం 3,04,965 కోట్ల కాగా విద్యకు కేవలం 23,108 వేల కోట్లు (7.57%) మాత్రమే కేటాయించి సంక్షోభం లో ఉన్న ప్రభుత్వ విద్యను బయట పడేయలేరు. రాష్ట్ర వ్యాప్తంగా పౌర సమాజం విద్యకు 15 శాతం  కేటాయించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికీ ముఖ్యమంత్రికి వేలాది ఇతరాలు రాసినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదు అనడానికి బడ్జెట్‌ ‌లోని  అంకెలే సాక్ష్యం. ఇప్పటికే ప్రభుత్వ విద్య మీద నమ్మకాన్ని కోల్పోయి 65% తల్లిదండ్రులు ఆర్ధిక భారం అయినా  ప్రైవేటు పాఠశాలలో చదివించుకుంటున్నారు. పేద వర్గాల పిల్లల కు నాణ్యమైన విద్య ను ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు కనిపించడం లేదు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి కేటాయించిన బడ్జెట్‌ ‌కూడా అత్యధిక శాతం విద్యా శాఖ సిబ్బంది జీత భత్యాలకే ఖర్చు అవుతుంది.

గత బడ్జెట్‌ ‌లో విద్యకు 21,292 (7.3శాతం) కేటాయించారు. ఈ  సంవత్సరం 1,816 అదనంగా పెంచారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి విద్యకు బడ్జెట్‌ ‌కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయి తప్ప పెరుగడం లేదు. 2014-15 లో 10 .89 శాతం కేటాయించి ప్రతి సంవత్సరం తగ్గిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ విద్య కు నిధులు కేటాయింపులు తగ్గుతున్నట్లు గానే ప్రభుత్వ బడులలో పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తుంది. 2014 -15 సంవత్సరం లో 24.85 లక్షల మంది విద్యార్థులు నమోదు కాగా 24 – 25 విద్యా సంవత్సరం లో కేవలం 16.86 లక్షల మంది మాత్రమే నమోదు అయ్యారు. దాదాపు 10 లక్షల మంది పిల్లలు గత పది సంవత్సరాలలో ప్రభుత్వ బడులలో తగ్గారు.  ఇంచు మించు అంతే మంది పిల్లలు ప్రైవేటు లో పెరిగారు. విద్య మీద నిధులు కేటాయించకుండా  ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రైవేటు విద్యా సంస్థలకు యాజమాన్యానికి ప్రభుత్వమే ఊత  నిచ్చినట్లు అవుతుంది.  ఇది తల్లిదండ్రుల మీద అతి పెద్ద ఆర్థిక భారం.
ఎన్ని సంక్షేమ పథకాలు అందించినా కొంత ఉపశమనం మాత్రమే.

ఇదే అసెంబ్లీ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు మరియు బీసీ రిజర్వేషన్‌ ‌బిల్లు ను ఆమోదించిన దశలో సంబరాలు చేసుకుంటున్న తరుణం లో అదే వర్గాల బిడ్డలకు నాణ్యమైన విద్య అందించ దానికి తగినన్ని నిధులను కేటాయించక పోవడం పట్ల అన్నీ ప్రజా సంఘాలు తీవ్రంగా ఆలోచించాలి. సామాన్య విద్యా అవకాశాలు అందించకపోతే  వచ్చే తరాలు రిజర్వేషన్‌ ‌ఫలాలు అందుకోలేరని గ్రహించాలి.  తగిన నిధులతో నాణ్యమైన విద్య అందిస్తే ప్రజల వెనుకబాటు తనాన్ని జయించే శాశ్వత పరిష్కారం.  తెలంగాణ ఉద్యమమే విద్యా ఉద్యోగాలు అనే ప్రధాన మైనా అంశాల మీద నడిచింది. తెలంగాణ మా వల్లనే సాధ్యం అయ్యింది అన్నవాళ్లు నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ ఇచ్చామన్న వాళ్లు తమ రెండు బడ్జెట్లలో పెద్దగా రాజకీయ సంకల్పాన్ని ప్రదర్శించ లేదు. తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించినట్లైతే సమాజం లో గౌరవప్రదమైన జీవనం గడుపుతారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ కుటుంబాల ఆశలకు ప్రభుత్వ విద్య ను మెరుగు పరిచే ఉద్దేశ్యం లేదని కలో  గంజో తాగి  తాకట్టు పెట్టి ఫీజులు భరిస్తూ ప్రైవేటు బాట పట్టారు.

కేవలం టీచర్లను నియమించడం తో వారికి జీత భత్యాలతో విద్యా వ్యవస్థ నడువదు. టీచర్లు పని చేసే వాతావరణం లో బడులు ఉండాలి. మౌలిక వసతుల నిధుల కోసం సైన్స్ ‌ల్యాబ్‌ ‌ల ఏర్పాటుకు బడులకు పెయింటింగులు కోసం హెచ్‌ ఎం ‌లు దాతల వెతుకులాటలో ఉండడం మనం చూస్తూనే ఉంటాము. ఆర కోరా వసతులతో పని చేసే వాతావరణం లేని బడులలో పాఠాలు చెప్పే ఉత్సాహాన్ని రోజు రోజు కు కోల్పుతుండడం మనం చూస్తూనే ఉన్నాము. టీచర్లు  కాదు ఈ బడులలో చదివే పిల్లలకు కూడా చదువుపట్ల తమ బడి పట్ల నిరుత్సాహం కూడా గమనిస్తున్నాము. నిధులు కేటాయించే ప్రభుత్వ  చిత్త శుద్ధిని ప్రశ్నించే శక్తి లేక  కొంత మంది ఉపాధ్యాయులు తమ సహనాన్ని కోల్పోయి తమకు తామే శిక్షించు కోవడం పిల్లలను తల్లిదండ్రులను దోషులుగా చేసి సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరగడం మనం గమనిస్తూనే ఉన్నాము.

భారత దేశ భవిష్యతు తరగతి గదులలో రూపు దిద్దుకుంటుందని అన్న కొఠారి గారి కొటేషన్‌  ‌ప్రతి సారి వింటూనే ఉంటాము. ఆయన నేతృత్వం లో విద్యా కమిషన్‌ ‌రాష్ట్రాల బడ్జెట్‌ ‌లో 30 శాతం నిధులను విద్యకు కేటాయించాలని అయిదు దశాబ్దాల క్రితమే ప్రతిపాదించారు. ఇప్పటి వరకు ఈ ప్రతిపాదనను అమలు పరచిన దాఖలాలు లేవు. యూపీఏ ప్రభుత్వ హాయం లో సోనియా గాంధీ నాయకత్వం లో కొన్ని ప్రజా హితమైన చట్టాలు వచ్చాయని చెప్పుకుంటాము. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం కూడా అందులో ఒకటి. రాష్ట్రం లో అధికారం లో ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ కేంద్రం లో తమ  పార్టీ ఆధ్వర్యం లో తెచ్చిన చట్టాన్ని కనీసం మాట వరసకైన అమలు చేస్తామని ప్రకటించాక పోవడం విచారకరం. విద్యా హక్కు చట్టం లో పాఠశాలల పనితీరు, విద్యా విషయాలు, పాఠ్య ప్రణాళికలు, బాలల హక్కులు, ఉపాధ్యాయుల నిబంధనలు,  ప్రైవేటు పాఠశాలలో పేదలకు రిజర్వేషన్లు వాటి నియంత్రణ మొదలగు ఎన్నో అంశాలను చట్టం  రూపొందించింది. అధికారం లో ఉన్న వాళ్ళు బడ్జెట్‌ ‌రూపకల్పన చేసే అప్పుడు కనీసం స్పృశించక పోవడం ఆందోళన కలిగించే విషయం . విద్యా హక్కు చట్టం న్యాయ వ్యవస్థ పరిధిలోనిది. ఈ చట్ట ఉల్లంఘన న్యాయ వ్యవస్థ పరిధిలోకి వస్తుంది. పౌర సమాజానికి బాలలకు విద్యను అందించే బాధ్యతను గుర్తు చేయడానికి పౌరసమాజానికి న్యాయ స్థానాన్ని ఆశ్రయించడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. అక్కడైనా బాలలకు న్యాయం దొరుకుతుందని ఆశిద్దాం.

  image.png
ఆర్‌.‌వెంకట్‌ ‌రెడ్డి
నేషనల్‌ ‌కన్వీనర్‌,
ఎం. ‌వి ఫౌండేషన్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page